Asianet News TeluguAsianet News Telugu

జగన్ పాదయాత్ర స్థూపం ఇదే (వీడియో)

వైఎస్ జగన్ పాదయాత్ర సంకల్పాన్ని చాటిచెప్పేలా చిరస్థాయిగా నిలిచిపోయేలా స్థూపాన్ని యుద్ధప్రాతిపదికన పార్టీ పూర్తిచేస్తోంది. పాదయాత్ర స్ఫూర్తిని, ప్రజలకిచ్చిన భరోసాలను గుర్తుకు తెస్తూ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈనెల 9న పాదయాత్ర ముగింపు సందర్భంగా శరవేగంగా పనులు చేస్తున్నారు. 

వైఎస్ జగన్ పాదయాత్ర సంకల్పాన్ని చాటిచెప్పేలా చిరస్థాయిగా నిలిచిపోయేలా స్థూపాన్ని యుద్ధప్రాతిపదికన పార్టీ పూర్తిచేస్తోంది. పాదయాత్ర స్ఫూర్తిని, ప్రజలకిచ్చిన భరోసాలను గుర్తుకు తెస్తూ ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈనెల 9న పాదయాత్ర ముగింపు సందర్భంగా శరవేగంగా పనులు చేస్తున్నారు. శ్రీకాకుళంనుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఎడమవైపున, అటువైపు బరంపురం నుంచి వస్తున్నప్పుడు కుడివైపున, ‘‘బహుదానది’’ తీరాన ఈస్థూపం రూపుదిద్దుకుంటోంది. ఇచ్ఛాపురం టౌన్‌కు 2 కిలోమీటర్ల ముందే ఈ స్థూపం కనిపిస్తుంది. పాదయాత్ర చివరిరోజున వైఎస్‌ జగన్‌ ఈ స్థూపాన్ని ఆవిష్కరిస్తారు.

Video Top Stories