చిన్న తనంలోనే తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ, తాతయ్యలే ప్రపంచంగా పెరిగాడు. అనుకోకుండా అతని జీవితంలో ఓ అమ్మాయి వచ్చింది. ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. సడెన్ గా ఏమైందో తెలీదు.. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. దీంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ప్రకాశం జిల్లా గద్దలగుంటలో నివసించే బక్కా నాగేంద్ర(30)కి  పది నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో... తల్లికి రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా... నాగేంద్ర అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరిగాడు. చెక్కపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతను సంవత్సరం పాటుగా ఓ యువతిని ప్రేమించాడు.

Also Read పేద యువతులే అతని టార్గెట్... మాయ చేసి తాళి కట్టాడు.

ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. ఇదే విషయం పెద్దలకు కూడా చెప్పారు. వారు కూడా ప్రేమను అంగీకరించడంతో... ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. సడెన్ గా ఏమైందో తెలీదు.. యువతి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేశారు. కారణం కూడా చెప్పకుండా ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.

నాగేంద్ర ప్రవర్తన తమకు నచ్చలేదని.. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో... తల్లిదండ్రుల ప్రేమ దొరకక.. ప్రేమించిన అమ్మాయి కూడా దక్కకపోపవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.