Asianet News TeluguAsianet News Telugu

'రూమ్‌కు రమ్మన్నాడు లేకపోతే ఫోటోలు బయట పెడతానన్నాడు': యువతి సూసైడ్

ఓ యువకుడి వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొంది. 

young girl commits suicide due to harassment in East godavari district
Author
SakhinetiPalli, First Published Feb 23, 2020, 11:53 AM IST


రాజమండ్రి: ఓ యువకుడు తన రూమ్‌కు రమ్మన్నాడని మనోవేదనకు గురైన  ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు యువతి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
 
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో ఈ ఘటనచోటుచేసుకుంది. ఓ యువకుడు తనను రూమ్‌కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు ఓ నోట్ కూడా రాసింది. 

ఇందులో ఆ యువకుడి గురించి విద్యార్థిని ప్రస్తావించింది.  సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్, వాట్సప్ చాటింగ్ వంటి కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి. 

అమ్మా నేను ఏ తప్పు చేయలేదు, నాకు బతలకాలని ఉంది. కానీ బతకనివ్వట్లేదని ఆ యువతి తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తన గదికి రాకపోతే తన ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా యువతి పేర్కొంది.

Also read:దివ్య హత్యకు వెంకటేష్ ప్లాన్స్ ఫెయిల్, వేములవాడలోనే కత్తి కొనుగోలు: పోలీసులు

 ఈ విషయం నీ ముఖంలోకి  చూసి చెప్పే ధైర్యం లేదని చెప్పింది.  తన ఫోటోలు బయట పెట్టకపోతేనే తన ఆత్మకు శాంతి కలుగుతోందని ఆ యువతి ఆ లేఖలో పేర్కొంది.   

ఈ విషయం ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తొలుత ఈ యువతి ఆత్మహత్య కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

యువతి తన ఇంట్లోనే ఈ నెల 12వ తేదీన ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios