Asianet News TeluguAsianet News Telugu

బాబుకు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్.. లక్షణాలివే: విజయసాయి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాదితో బాధపడుతున్నారని అన్నారు

ycp mp vijaya sai reddy satirical comments on tdp chief chandrababu via twitter
Author
Visakhapatnam, First Published Feb 27, 2020, 5:03 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. బాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాదితో బాధపడుతున్నారని అన్నారు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి, అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలన్నారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కిందకే వస్తాయని విజయసాయి ట్వీట్ చేశారు. 

కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!’అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read:విదేశాలకు డబ్బులు,చంద్రబాబు జైలుకే: రోజా

కాగా అంతకుముందు చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‌లో ఆయన్ను ఉంచారు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైకాపా శ్రేణులు విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగారు.

Also Read:బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది: విజయసాయి

ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలు కూడా పోటాపోటీగా ఆందోళనకు దిగారు. ఆందోళనల నేపథ్యంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయ బయట తన కాన్వాయ్‌లోనే సుమారు మూడు గంటలసేపు ఉండిపోయారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios