విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది ప్రజా చైతన్య యాత్ర కాదని, పిచ్చోడి యాత్ర అని రోజా వ్యాఖ్యానించారు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. గురువారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఏం తమ్ముడూ బ్రాండ్లన్నీ దొరుకుతున్నాయా, తాగుబోతుల పొట్టకొడుతుందీ ప్రభుత్వం. రోజంతా పనిచేసి బాధను మరిచిపోవడానికి మీరు ఓ పెగ్గేసుకుంటే రేట్లు పెంచి మీ పొట్ట కొడుతునిారు. ప్రశ్నిస్తే మా మీదే కేసులు పెడతారా అని చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోగా ఆ వ్యాఖ్యలు చేశారు.

జైలుకు వెళ్తాననే భయం చంద్రబాబుకు పట్టుకుందని రోజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవమాసాల పాలనతో నారావారి నవనాడులు చిట్లిపోయాయని ఆమె వ్యాఖ్యాననించారు. 

అందుకే ఐటీ సోదాలు, దోపిడీలపై మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగల్లా చందర్బాబు, లోకేష్ తిరుగుతున్నారని ఆమె అన్నారు. ఐటీ దాడులతో ఎప్పుడు లోపలేస్తారోనని చంద్రబాబు భయపడుతున్నారని ఆమె అన్నారు. అందుకే బస్సు యాత్రం పేరుతో అబద్ధాలు చెబుతున్నాడని ఆమె అన్నారు. 

ఐటీని తానే కనిపెట్టానని చెప్పుకునే బాబు ఇప్పుడు ఐటీ పేరు చెప్తేనే వణికిపోతున్నారని ఆమె అన్నారు. కాగా, ఆమె నీరుకొండ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సమ్మిట్ లో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు అమరావతిలో చుక్కెదురైంది. మంగళగిరిలో ఆమెకు నిరసన సెగ తగిలింది. రోజా పర్యటనను అడ్డగించేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు. 

నీరుకొండ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సమ్మిట్ లో పాల్గొనేందుకు గురువారం వచ్చిన రోజాను మహిళలు, రైతులు అడ్డుకున్నారు. ఆమె వాహనం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అమరావతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం వెలుపల కూడా మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు.