Asianet News TeluguAsianet News Telugu

బాలికతో వ్యభిచారం కేసు : నిందితుల్లో మంత్రి మోపీదేవి ముఖ్య అనుచరుడు..

ఆస్పత్రిలో పరిచయమైన ఓ మహిళ కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటువైద్యం చేయిస్తానని ఆ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి.. నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కుమార్తెను ఆ మహిళ వెంట పంపాడు. కరోనా తగ్గిపోయాక సదరు మహిళ ఆ బాలికను తిరిగి తండ్రి దగ్గరికి పంపించకుండా వ్యభిచారంలోకి దింపింది.

YCP Minister Mopidevi follower among the accused in Prostitution with a girl case in guntur
Author
Hyderabad, First Published Jan 27, 2022, 8:25 AM IST

గుంటూరు : gunturలో బాలికతో Prostitution చేయించిన కేసులో మరో ఐదుగురిని గుంటూరు జిల్లా Arandal Peta పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు భూ శంకర్రావు ఉన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  Corona virus బారిన పడడంతో ఆ బాలికతో పాటు ఆమె తల్లి గతేడాది జూన్ లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. 

ఆ తరువాత చికిత్స పొందుతూ ఆమె తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ బాలిక బాగోగులను తండ్రి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో పరిచయమైన ఓ మహిళ కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటువైద్యం చేయిస్తానని ఆ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి.. నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కుమార్తెను ఆ మహిళ వెంట పంపాడు.

కరోనా తగ్గిపోయాక సదరు మహిళ ఆ బాలికను తిరిగి తండ్రి దగ్గరికి పంపించకుండా వ్యభిచారంలోకి దింపింది.  గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి వ్యభిచారం చేయించింది.  ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి తప్పించుకున్న బాలిక పేరేచర్లలో ఉంటున్న తన తండ్రి వద్దకు చేరుకుని మేడికొండూరు ఠాణాలో ఫిర్యాదు చేసింది.

అక్కడ Zero FIR నమోదు చేసిన పోలీసులు అరండల్ పేటకు కేసును బదిలీ చేశారు. బాలికను పోలీసులు విచారించడంతో ఈ రాకెట్ లో మొత్తం 45 మందికి పైగా ఉన్నట్లు తేలింది. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయని, అందరి పేర్లు లేవని ఆ బాలిక న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.

దీంతో వ్యభిచార నిర్వాహకులు, విటులను కూడా అరెస్టు చేయాలని జడ్జి ఆదేశించారు. ఇందులో భాగంగా నిజాంపట్నంకు చెందిన భూ శంకర్రావు, వ్యభిచారం నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన సింహాచలం, విటులు క్రాంతి కుమార్, శివరామకృష్ణ, నాగిరెడ్డి శివను అరండల్ పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 36 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

భూ శంకర్రావు వైసీపీ ఎంపీ  అనుచరుడే :  లోకేష్
ఎన్ని నేరాలు చేసిన తమ అధినేత జగన్ రెడ్డి కాపాడతారనే ధైర్యంతోనే వైసిపి వాళ్ళు చేస్తున్న అకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది అని పేర్కొంటూ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. గుంటూరులో బాలికపై లైంగికదాడికి పాల్పడిన భూశంకర్రావు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అనుచరుడేనని పేర్కొంటూ బుధవారం ట్వీట్ చేశారు.

‘ యథా లీడర్.. తథా కేడర్..  అన్నట్లుంది వైసీపీ పరిస్థితి. పాలకులే  నేరగాళ్లు అయితే  వాళ్ల అనుచరులు పాల్పడే ఘోరాలకు అంత లేదని  మోపిదేవి రైట్ హ్యాండ్  భూశంకర్రావు  నిరూపించాడు..’  అని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సీఎం జగన్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణతో భూ శంకర్రావు ఉన్న ఫొటోను లోకేష్ తన  ట్వీట్ కు జత చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios