నాలుగేళ్లు ఏం చేయలేక.. ఇంకోసారి అవకాశం ఇవ్వమంటున్నాడు..

ycp leader parthasarathi fires on chandrababau naidu
Highlights

నాలుగేళ్లు ఏం చేయలేక.. ఇంకోసారి అవకాశం ఇవ్వమంటున్నాడు..

విభజనతో సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని తిరిగి గాడినపెడతాడని అధికారమిస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అంపశయ్య మీద పడుకోబెట్టారని విమర్శించారు వైసీపీ నేత పార్థసారథి. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లు సీఎంగా ఉంది.. రాష్ట్రానికి అన్యాయం చేసి.. ఇప్పుడు తనకు మరో అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడు ఆయనను సాగనంపుదామా అని జనం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు..

ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని.. ఏపీని విదేశాలకి తాకట్టు పెట్టే ఆయన జన్మభూమి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. హోదా కంటే ఎక్కువగా ప్యాకేజీ కోసం తాపత్రయపడింది వాస్తవం కాదా..? జగన్ ఏ విషయంలో అబద్ధం చెప్పారు.. ? ముఖ్యమంత్రికి కనీస విలువలు ఉన్నాయా అంటూ పార్థసారథి నిలదీశారు.. టీడపీ ఎంపీలు అందరి ముందు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతే కుట్రలు, కుతంత్రాలు అంటూ విమర్శిస్తారా అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు ముక్క నేల కు రాసి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు. 

loader