అమరావతి: పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. ఫిరాయింపుల వల్ల పార్టీలు బలపడతాయనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ పార్టీ గతంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుతెచ్చుకున్నాం ఏమైంది. 

ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ప్రభుత్వమే పోయిందన్నారు. అది కూడా భయంకరంగా పోయిందంటూ చెప్పుకొచ్చారు.  ఇప్పుడు ఆ 23 మంది ఏం చేయగలిగారు. వాస్తవానికి పార్టీకి ఆ 23 మంది చేసిన మేలేంటని ప్రశ్నించారు. తాను మెుదటి నుంచి ఫిరాయింపులను వ్యతిరేకిస్తానని తెలిపారు. 

ఫిరాయింపులు ఏ పార్టీలో అయినా అంతర్గత విబేధాలకు కారణమవుతాయని తాను తొలి నుంచి చెప్తూనే వచ్చానంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అది అనైతిక చర్య అంటూ చెప్పుకొచ్చారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు.