అనంతపురం: తన కోరిక తీర్చకపోవడంతో బలవంతంగా పురుగుల మందు తాగించడంతో ఓ యువతి మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటు చేసుకొంది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా డి. హీరేహాల్ మండలం నాగలాపురం గ్రామంలో చోటు చేసుకొంది. శివకుమార్ అనే యువకుడు  ఓ యువతిని తన కామవాంఛ తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆమె తిరస్కరించింది. పొలంలో ఉన్న ఆ యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించాడు.

 ఈ విషయాన్ని గమనించిన పక్క పొలంలోనే ఉన్న రైతులు బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బళ్లారికి బాధితురాలిని తరించారు. బళ్లారి విమ్స్ లో  చికిత్స పొందుతూ సోమవారం నాడు మృతి చెందింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.