మత్తుమందుచ్చి యువతిపై గ్యాంగ్ రేప్, గుంటూరు జిల్లాలో దారుణం

woman gang raped by auto driver and his friends in Guntur
Highlights

ఆటోడ్రైవర్ అతడి స్నేహితుల ఘాతుకం...

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కల్లుమూసుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ ఓ యువతికి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో కలిసి సామూహికంగా బలత్కారం చేశారు. 

ఈ అత్యాచార దుర్ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లచెరువు గ్రామానికి చెందిన యువతికి రఫీ అనే ఆటో డ్రైవర్ తో పరిచయం ఉంది. అయితే అతడు యువతికి మాయమాటలు చెప్పి నిన్న రాత్రి గుంటూరులోని నెహ్రూ నగర్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు తెలియకుండా మత్తుమందిచ్చాడు. దీంతో యువతి మత్తులోకి జారుకోగానే దారుణానికి పాల్పడ్డాడు.

రఫీ తన స్నేహితులతో కలిసి స్పృహలో లేని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లవారుజాము మెలకువ వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని గుర్తించిన యువతి స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడు దొరికితే ఈ అత్యాచారానికి పాల్పడిన మిగతావారి వివరాలు కూడా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

కామాంధుల చేతుల్లో నలిగాపోయిన యువతిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

loader