బంగారం ఇప్పిస్తానని గ్యాంగ్ రేప్.. నగ్న వీడియోలు నెట్ లో పెడతామని బ్లాక్ మెయిల్...
గుంటూరు జిల్లాలో కలకలం రేపిన గ్యాంగ్ రేప్ కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కృష్ణయ్య మంగళవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన ఓ యువతి భర్తతో విభేదాల కారణంగా నరసరావుపేట పట్టణంలో ఒంటరిగా నివసిస్తోంది.

తన దగ్గరున్న 47 సవర్ల బంగారాన్ని భద్రపరచమని సుమారు ఏడాది కిందట బరంపేటకు చెందిన ఆవుల మస్తాన్ రావు, కనపర్రు గ్రామానికి చెందిన శ్రీనివాస రావులకు ఇచ్చింది. అయితే బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఈ క్రమంలో బంగారం తిరిగి ఇప్పిస్తానని మాజీ రౌడీషీటర్ గుజ్జర్లపూడి ఆనంద్ విజయ్ కుమార్ అలియాస్ కన్నల్ పోలీస్ స్టేషన్ లో 6 నెలల కిందట ఆమెతో పరిచయం చేసుకున్నాడు. తర్వాత శ్రీనివాస్ నగర్లో ఓ గృహం వద్దకు తీసుకుని యువతిని అక్కడ ఉంచాడు.
జైలు నుండి ధూళిపాళ్ల విడుదల... పరామర్శించిన చంద్రబాబు...
ఈ ఏడాది మార్చి 14వ తేదీన కన్నల్, అతని స్నేహితుడు వినుకొండ నియోజకవర్గ ఓ పార్టీ ఇన్చార్జి అట్లూరి విజయ్ కుమార్ కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత విషయం ఎక్కడైనా చెబితే తనదగ్గర ఉన్న వీడియోలు నెట్లో పెడతామని ఆమెను బెదిరించారు.
ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు అదే రోజు గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేశారు. అప్పటినుంచి నిందితులిద్దరూ పరారై ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కేసులో నిందితుడైన అట్లూరి విజయ్ కుమార్ ను అరెస్టు చేశారు.