గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రానలు ఇంటర్నెట్ లో పెడుతానని తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తితో ప్రకాశం జిల్లాకు చెందిన తనకు 2016లో వివాహమైందని చెప్పింది.

కట్నం కింద లక్ష రూపాయలు, 5 సవర్ల బంగారం సామాన్లు, రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంటి స్థలంరాసిచ్చామని, తనకు పాప పుట్టినప్పటి నుంచి భర్త, అత్తామామలు, ఆడపడచులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె చెప్పింది. దానిపై 2018లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదైనట్లు, కేసు కోర్టులో పెండింగులో ఉందని, 2019లో భరణం కేసు వేయగా అది పెండింగులో ఉందని వివరించింది. 

తన భర్త కొద్ది రోజులుగా తన సమీప బంధువుకి ఫోన్ చేసి తన ఫోన్ ట్యాప్ చేసి రికార్డు చేసినటలు, వాటిలో కొన్నింటిని వాట్సప్ సందేశాలు పంపుతున్న్టలు తెలిపిందని మహిళ చెప్పింది. తాను విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెడుతానని బెదిరిస్తున్నట్లు తెలిపింది. 

తెలిసిన వ్యక్తుల సాయంతో రెండు సెల్ కంపెనీల ప్రతినిధుల సహాయంతో తన ఫోన్ ను భర్త ట్యాప్ చేసినట్లు చెప్పింది. భర్తపై, అతనికి సహకరించిన ఆడపడుచు, సెల్ కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ మేరకు ఆమె గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసింది. 

మరో మహిళ కూడా గ్రీవెన్స్ సెల్ లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. తూళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామానికి చెందిన జి. అన్నారావుతో అదే గ్రామానికి చెందిన సౌజన్యకు 2008లో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వివాహమైనప్పటి నుంచి అనుమానంతో భర్త తనను వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. 

చెడు వ్యసనాలకు బానిసయ్యాడని కూడా తెలిపింది. వారసుడిగా మగ పిల్లవాడుకావాలని, విడాకులు ఇస్తే మరో వివాహం చేసుకుంటానని భర్త వేధించేవాడని తెలిపింది. పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షలు తేవాలని, లేదంటే ఇంట్లోంచి వెళ్లిపోవాలని గెంటేశాడని ఆమె చెప్పింది.