హైదరాబాద్: పార్టీలో కొందరు నాయకులు రహస్య సమావేశాలను నిర్వహిస్తూ పార్టీకి నష్టం కల్గించే విధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు.ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

పార్టీలో రహస్య సమావేశాలకు కేంద్రంగా మారిన నాయకుడు ఎవరో బటయకు రావాల్సిన అవసరం ఉందన్నారు.పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగుతారని  కుంతియా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పార్టీకి వ్యతిరేకంగా రహస్య సమావేశాలను నిర్వహించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేవుళ్లకు మొక్కులు తీర్చుకొనేందుకు కేసీఆర్ లక్షలాది రూపాయాలను ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు  ఏం చేశారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను కోరారు.