అగ్గిపుల్లను పొయ్యి వెలిగిచ్చుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా కొంప తగలబెట్టటానికీ ఉపయోగించవచ్చు. అంటే అగ్గిపుల్ల ఉపయోగం ఒకటే.  అయితే దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదానిపైన ఆధారపడి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా పరిస్ధితి కూడా అదే విధంగా తయారైంది. విజ్ఞానాన్ని పెంచుకోవటానికి ఉపయోగించుకునే వారున్నట్లే అవాంఛనీయ (సెక్స్) వ్యవహారాలకు ఉపయోగించుకునే వారు కూడా ఉన్నారు. కాకపోతే అటువంటి వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతోంది.

ఇపుడిదంతా ఎందుకంటే, సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా వాడేది వాట్సప్, ఫేస్ బుక్ నే. ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం తదితరాలున్నప్పటికీ అంతగా పాపులర్ కాదు. వాట్సప్, ఫేస్ బుక్ లో ఖాతాదారులుగా కొన్ని లక్షలమందుంటారు. ఎప్పుడైతే ఖాతాదారుల సంఖ్య లక్షల్లో ఉంటుందో వెంటనే సెక్స్ కు సంబంధించిన సైట్లు కూడా జోరందుకున్నాయి. ఫెస్ బుక్ , వాట్సప్ లో రోజు కొన్ని పదుల సంఖ్యలో గ్రూపుల్లో చేరమంటూ ఆహ్వానాలు వస్తుంటాయి.

ప్రస్తుతానికి వాట్సప్ గ్రూపుల్లో చేరమంటూ పదుల సంఖ్యలో ఆహ్వానాలు వస్తుండగా ఫేస్ బుక్ లో మాత్రం వందల సైట్లున్నాయి. సాంకేతిక అన్నది ఉపయోగించుకునే వారిని బట్టి ఉంటుంది. ఇప్పటికే పోర్న్ సైట్లను నియంత్రణ చేయలేక ప్రభుత్వం అవస్తలు పడుతుండగా తాజాగా పుట్టుకొస్తున్న వాట్పప్, ఫేస్ బుక్ లో సెక్స్ గ్రూపలనన్నా నియింత్రించ గలిగితే అందరికీ మంచిది.