AP weather update: మ‌రో మూడు రోజులు రాష్ట్రంలో వ‌ర్షాలు..

AP weather update: దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్ర‌స్తుతం వ‌ర్షాలు కురుస్తాయి. ప‌లు చోట్ల ఇప్ప‌టికే భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో రోడ్లు, లోత‌ట్టు ప్రాంతాలల్లో వ‌ర్షపు నీరు నిలిచిపోయింది. కాగా, మ‌రో మూడు రోజుల పాటు ఏపీలో వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.  
 

weather update: Heavy rains to continue for three more days in parts of Andhra Pradesh

Heavy rains to continue for three more days: విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. అలాగే, ప్రాంతీయ వాతావ‌ర‌ణ విభాగం త‌న బులిటెన్ లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని విపత్తుల నిర్వ‌హ‌ణ‌ సంస్థ (APSDMA)హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో శ్రీశైలం మల్లన్న సమీపంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.

తెలంగాణ‌లోనూ.. 

తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్ లో వ‌రుస‌గా దంచి కొడుతున్న వాన‌ల‌తో చాలా ప్రాంతాల్లో వ‌ర్ష‌పు నీరు ప్ర‌వ‌హిస్తోంది. ప‌లు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో పంట‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. 

బుధ‌వారం వాతావ‌ర‌ణ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహేలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా వివిక్త ప్రదేశాలలో ఉరుములు-మెరుపులతో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయి.
  • పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తాయని అంచనా.
  • జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, విదర్భ, బీహార్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గుజరాత్, మధ్య మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
  • మరాఠ్వాడా, తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ విభాగం అంచ‌నా వేసింది.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios