విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలికి పరామర్శ: చంద్రబాబు ముందే వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. రాష్ట్ర మహిళా కమిసన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. చంద్రబాబు ముందే ఈ ఘటన చోటు చేసుకొంది.
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ Vasireddy Padma కు,TDP నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది, టీడీపీ కార్యకర్తలు వాసిరెడ్డి పద్మను నిలదీశారు.
Gang Rapeకి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ శుక్రవారం నాడు విజయవాడ పాత ఆసుపత్రికి వచ్చారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ బాధితురాలి వద్ద ఉన్న సమయంలోనే Chandrababu Naidu కూడా అక్కడికి చేరుకున్నారు. వాసిరెడ్డి పద్మ ఆసుపత్రి లోపలికి వెళ్లే సమయంలోనే టీడీపీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో ఆమె ఆసుపత్రి లోపలికి వెళ్లింది.
బాధితురాలిని పరామర్శించింది. అయితే అదే సమయంలో బాధితురాలి వద్దకు చంద్రబాబు కూడా వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇదే సమయంలో టీడీపీ నేత పంచుమర్తి అనురాధ, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య మాటల యుద్ధం సాగింది. మధ్యలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా ఈ విషయమై జోక్యం చేసుకొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వాసిరెడ్డి పద్మ మధ్య గొడవ జరిగింది. పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. చంద్రబాబు ముందే ఈ ఘటన చోటు చేసుకొంది. బాధితురాలికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హమీ ఇచ్చారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. రాజకీయం చేయడం కోసం గ్యాంగ్ రేప్ ఘటనను ఉపయోగించుకొంటున్నారని ఆమె టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ముందే విజయవాడ సీపీ క్రాంతి రాణా ను ఆదేశించినట్టుగా వాసిరెడ్డి పద్మ చెప్పారు.