కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించొద్దంటూ తహసీల్దార్ వనజాక్షిని గ్రామస్తులు కోరారు.

అయితే సమావేశం నుంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలని వనజాక్షి వ్యాఖ్యానించడంతో గ్రామస్తులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్ని బ్రోకర్లంటారా అంటూ వనజాక్షిపై దాడికి యత్నించారు. 

దీనిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణాజిల్లా కార్యదర్శి కోట కల్యాణ్ మాట్లాడుతూ.. రైతులను బ్రోకర్లు అన్నందుకు రైతులు క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే రైతులు అని కూడా చూడకుండా కింద పడేసి కాళ్లతో తొక్కిన వనజాక్షిపై స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

Also Read:వనజాక్షిది ఏ తప్పూ లేదు

కృష్ణాజిల్లాలో ఆమధ్య ఇసుక తవ్వకాల విషయంలో వనజాక్షి-చింతమనేని ప్రభాకర్ వివాదం గుర్తుందా? ఆ వివాదంపై చంద్రబాబునాయుడు వేసిన కమిటి వనజాక్షి తప్పులేదని తేల్చింది.

దాంతో సదరు వివాదంలో ఎంఎల్ఏపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే విషయంలో చర్చ మొదలైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఇసుక తవ్వకాల్లో భాగంగా కృష్ణాజిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులున్నాయి. 

ఆ విషయమై పరిశీలించమని కలెక్టర్ ఆదేశిస్తే ఎంఆర్ఓ వనజాక్షి తవ్వకాలు జరుగుతున్న స్థలానికి వెళ్ళి పరిశీలించారు. అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని గమనించి అడ్డుకోబోయారు. దాంతో ఎంఎల్ఏ, అనుచరులు వనజాక్షిపై దాడి చేసారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రంలో పెద్ద సంచలనం.

సరే, దాడికి గురైంది ఎంఆర్ఓ. దాడిచేసింది టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్. దాంతో చంద్రబాబు ఎంఎల్ఏకే వత్తాసు పలికారు. తప్పంతా వనజాక్షిదే అంటూ ఏకపక్షంగా తీర్పు కూడా చేప్పేసారు. ఎంఆర్ఓ తన పరిధి దాటి వ్యవహరించారంటూ అప్పట్లో వనజాక్షిపై చంద్రబాబు చిందులు కూడా తొక్కారు.

అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా ఈ విషయమై చర్చకు పెట్టి ఎంఎల్ఏకి క్లీన్ చిట్ ఇచ్చేసారు. దాంతో రెవిన్యూ ఉద్యోగులు మండిపోయారు. వెంటనే ఘటనపై ఇద్దరు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటి వేసారు.

Also Read:చీఫ్ విప్ చింతమనేని, ఎమ్మార్వో వనజాక్షి చేతులు కలిపారు

కమిటీ ఘటనకు దారితీసిన పరిస్ధితులను పరిశీలించింది. ఇరువర్గాల వాదనలు విన్నది. తానేమి పరిధిదాటలేదని వనజాక్షి తన వాదనకు మద్దతుగా బలమైన ఆధారాలను కమిటీ ముందుంచింది.

జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, జిల్లా సరిహద్దులు, ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం మ్యాపులతో సహా కమిటి ముందు పెట్టారు. అదే సమయంలో తవ్వకాలు సక్రమమే అనేందుకు ఎంఎల్ఏ వద్ద ఏ ఆధారాలే లేవు. కేవలం తాను టిడిపి ఎంల్ఎల్ఏ అన్న వాదన ఒక్కటే ఉంది.

దాంతో కమిటీ తమ పరిశీలన పూర్తి చేసి ఇరువైపుల వాదనను విన్న తర్వాత నివేదిక ఇచ్చింది. అందులో వనజాక్షి తప్పేమీ లేదని, ఎంఎల్ఏనే అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లు కమిటి స్పష్టంగా పేర్కొంది.