మత్తిచ్చి యువతిపై రేప్: నగ్న దృశ్యాల చిత్రీకరణ, బ్లాక్ మెయిల్

First Published 13, Jul 2018, 11:05 AM IST
Vijayawada young lady complaint against laxman for sexual harassment
Highlights

ప్రేమించానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకొంటానని నమ్మించి బాధితురాలిపై పలు దఫాలులైంగిక దాడికి పాల్పడ్డాడు


విజయవాడ:ప్రేమించానని నమ్మించి ఓ యువతిపై  పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన  లక్ష్మణ్ అనే యువకుడిపై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ ఘటన  విజయవాడలో చోటు చేసుకొంది. 

విజయవాడలోని చిట్టినగర్ దుర్గాసి రాములు వీధికి చెందిన పి. లక్ష్మణ్ అనే యువకుడు  క్రికెట్ ఆడేందుకు సమీపంలోని స్కూల్ ఆవరణకు వెళ్లేవాడు. అయితే అక్కడే నివాసం ఉండే  ఓ యువతిపై కన్నేశాడు. క్రికెట్ ఆడే సమయంలో మంచినీళ్లు కావాలంటూ ఆ యువతితో  మాటలు కలిపాడు.

కొంతకాలం తర్వాత ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెకు ఫోన్ చేసేవాడు. ఆ యువతితో  ప్రతి రోజూ  చాటింగ్ చేసేవాడు.  ప్రేమిస్తున్నానని చెప్పి ఆ యువతిని నమ్మించాడు.  పెళ్లి చేసుకొంటానని కూడ  ఆ యువతిని నమ్మబలికాడు. 

అయితే ఈ క్రమంలో  తన కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని చెప్పి ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు.  అయితే తనకు సమాచారం లేకుండానే తమ కుటుంబసభ్యులకు బయటకు వెళ్లారని  ఆ యువతిని నమ్మించాడు.  మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి  ఆ యువతిపై  అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు  బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియోలు తీశాడు.

ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చెబుతానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు పెళ్లి చేసుకొంటానని ఆమెను నమ్మించి తన వెంట తిప్పుకొన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు లక్ష్మ‌ణ్ ను డిమాండ్ చేసింది. 

అయితే లక్ష్మణ్ మాత్రం  అందుకు అంగీకరించలేదు.  తన ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి  బాధితురాలి నుండి తప్పించుకు తిరుగుతున్నారు.  తనకు న్యాయం చేయాలని కోరుతూ  బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 

loader