విజయవాడ: చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో  దోషికి ఉరిశిక్షను ఖరారు చేసింది విజయవాడ ఫోక్సో కోర్టు.2019 నవంబర్ 10వ తేదీన  చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు పెంటయ్య. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేశాడు.

ఈ కేసును విచారించిన పోలీసులు పెంటయ్యే హత్య చేసినట్టుగా సాక్ష్యాలను  సేకరించారు. ఈ మేరకు పోక్సో కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత కోర్టు ఇవాళ తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో పెంటయ్య చేసిన నేరం రుజువైందని   కోర్టు తెలిపింది. ఈ కేసులో పెంటయ్యకు ఉరి శిక్షను విధిస్తూ విజయవాడ స్పెషల్ ఫోక్సో కోర్టు మంగళవారం నాడు తీర్పు చెప్పింది.

సుమారు 9 మాసాల వ్యవధిలోనే ఈ కేసులో తీర్పు వెలువడింది. చిన్నారిని హత్య చేసిన కేసులో దోషి పెంటయ్యకు ఉరి శిక్ష పడింది. దోషికి శిక్ష పడేలా ఈ కేసులో పోలీసులు అన్ని రకాల ఆధారాలను సేకరించారు. దోషికి శిక్షపడేలా చేసిన పోలీసులకు బాధిత కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.