విజయవాడ: విజయవాడ భవానీపురంలో ఎనిమిదేళ్ల ద్వారకను హత్య చేసిన నిందితుడు ప్రకాష్ అలియాస్ పెంటయ్యకు నేరచరిత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడ ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుకు వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

Alsor read:ప్రియుడితో తల్లి రాసలీలలు: విజయవాడ ద్వారక హత్యలో ట్విస్ట్

ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం అదృశ్యమైన ఎనిమిదేళ్ల ద్వారక అదృశ్యమై  సోమవారం నాడు సాయంత్రం శవంగా తేలింది. తాను పెదనాన్న అని పిలిచే వ్యక్తే ద్వారకపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

Also read:విజయవాడ: చిన్నారి హత్య కేసులో అత్యాచారం కోణం.. మెడపై గోళ్లతో రక్కిన గుర్తులు

ద్వారక హత్య కేసులో ద్వారక తల్లి వెంకటరమణ హస్తం కూడ ఉందని  పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటరమణకు, నిందితుడు పెంటయ్యకు మధ్యవివాహేతర సంబంధం ఉంది. ఆదివారం నాడు తన తల్లి వెంకటరమణ పెంటయ్యతో సన్నిహితంగా ఉన్నప్పుడు ద్వారక చూడడంతో వెంకటరమణ సూచన మేరకు పెంటయ్య ద్వారకను హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Also Read:ఎనిమిదేళ్ల బాలిక దారుణహత్య: పక్కింటి వ్యక్తే నిందితుడు..పట్టించిన భార్య

అయితే ఈ కేసులో ఇంకా వాస్తవాలను వెలికితీసేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు. పెంటయ్య గత చరిత్రను పోలీసులు  తవ్వుతున్నారు. పెంటయ్యపై గతంలో కూడ కొన్ని కేసులు ఉన్న విషయాన్ని గుర్తించారు.

గతంలో కూడ పెంటయ్య ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో పెంటయ్య రెండేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఇటీవలనే  పెంటయ్య జైలు నుండి  విడుదలయ్యాడు.

ద్వారక హత్య కేసులో పెంటయ్యను విచారించే సమయంలో పాత కేసులో కూడ పెంటయ్య నిందితుడనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read:చిత్తూరు బాలికపై అత్యాచారం, హత్య... మహిళా కమీషన్ ఛైర్మన్ ఏమన్నారంటే

పెంటయ్యపై గతంలో ఈ ఒక్క కేసే నమోదైందా ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. ద్వారకను హత్య చేసిన కేసులో వెంకటరమణతో పాటు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్వారకాను హత్య చేసే ముందు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ద్వారకా మెడపై గొంతుపై కూడ రక్తం మరకలు ఉన్నాయి.ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం విజయవాడ భవానీపురంలో ఆడుకొంటున్న ద్వారక అదృశ్యమైంది. ఈ నెల 11వ తేదీన ద్వారక మృతదేహన్ని పోలీసులు పెంటయ్య ఇంటి నుండి స్వాధీనం చేసుకొన్నారు. 

పెంటయ్యభార్య సునీతే  తన ఇంట్లోని గోనెసంచిలో ఉన్న ద్వారక మృతదేహాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చింది. అయితే ద్వారకను హత్య చేసిన తర్వాత తనకు ఏమీ తెలియన్నట్టుగానే పెంటయ్య వ్యవహరించాడు.