విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో బుధవారం నాడు రాత్రి యువతిపై  ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
 

Vijayawada Police Arrested Two For Gang Rape

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకొంది. యువతిపై ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రియుడే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు  ఇద్దరిని Police అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

విజయవాడ Payakapuram వాంబే కాలనీకి చెందిన యువతి రెండు రోజులుగా అదృశ్యమైంది. ఆ యువతి రెండు రోజులుగా కన్పించకపోవడంతో పోలీసులకు పేరేంట్స్ పిర్యాదు చేశారు.ఈ విషయమై ఆ యువతి కోసం పోలీసులు , కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు.  అయితే బుధవారం నాడు రాత్రి విజయవాడ ఆసుపత్రికి వెనుక భాగంలో ముంగ్గురు నిందితులు Gang Rape పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

బాధితురాలికి మతిస్థిమితం లేదని పేరేంట్స్ చెబుతున్నారు. బాధితురాలిని ఇంటి నుండి ప్రియుడే తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా  పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు.

పోలీసుల సకాలంలో స్పందించలేదు: బాధితురాలి సోదరుడి ఆరోపణ

ఈ నెల 29వ తేదీన తమ సోదరి ఇంటి నుండి తప్పిపోయిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదన్నారు. తమ సోదరి బ్యాగును వెదికితే ఓ ఫోన్ నెంబర్ లభ్యమైందన్నారు.ఈ ఫోన్ నెంబర్ పోలీసులకు ఇచ్చామన్నారు. ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే నిందితుడు దొరికేవాడన్నారు. తాము ఫోన్ చేస్తే నిందితుడు ఫోన్ లిప్ట్ చేసి మాట్లాడడం లేదన్నారు. ఇదే విషయమై పోలీసులకు కూడా చెప్పామన్నారు.   ప్రభుత్వాసుపత్రిలోనే మహిళలకు రక్షణ లేదని నున్న పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios