విజయవాడ బ్యూటీపార్లర్ లో వ్యభిచారం.. రట్టుచేసిన పోలీసులు

vijayawada.. cross sex rocket bursted in beauty parlour
Highlights

ఈ దాడుల్లో నిర్వాహాకులతో పాటూ మసాజ్‌లు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోగా.. 10మందికిపైగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. 

విజయవాడలోని ఓ బ్లూటీపార్లర్ లో జరుగుతున్న వ్యభిచార గుట్టుని పోలీసులు రట్టు చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ, మొగల్రాజపురం, లబ్బీపేటల్లో ఉన్న మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. చాలారోజులుగా నిబంధనలకు విరుద్ధంగా.. మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు తేలింది. 

కొన్నిచోట్ల వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ దాడుల్లో నిర్వాహాకులతో పాటూ మసాజ్‌లు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోగా.. 10మందికిపైగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. 

విజయవాడలో చాలా రోజులుగా బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ల ముసుగులో ఈ చీకటి బాగోతం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండు టీమ్‌లుగా విడిపోయి ఈ దాడులు చేశారట. ఇకపై క్రాస్ మసాజ్‌లు చేయిస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు పోలీసులు. ఇకపై నగరంలోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచుతామంటున్నారు. 
 

loader