రెండు రోజుల్లో నా డెడ్‌బాడీని చూస్తారు: కేంద్ర మంత్రికి సీఎం రమేష్ హెచ్చరిక

Union minister Beerendra singh phoned to TDP MP Cm Ramesh
Highlights

సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

కడప: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబందించి కేంద్రం నుండి  రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన రాకపోతే తన  డెడ్‌బాడీని చూస్తారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ను హెచ్చరించారు. కేంద్రం నుండి స్పష్టమైన హమీ ఇచ్చేంత వరకు తాను దీక్షను విరమించనని ఆయన ప్రకటించారు. 

గురువారం నాడు  మరోసారి టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో న్యూఢీల్లో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై అన్ని రకాలుగా సహకరిస్తామని రాసిన లేఖను కేంద్ర మంత్రికి అందించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై ఎంపీలు మంత్రితో చర్చించారు.

ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్ష  చేస్తున్నారు.ఆరోగ్యం క్షీణించడంతో ఎమ్మెల్సీ బీటెక్ రవిని  బుధవారం సాయంత్రం ఆసుపత్రికి తరలించారు.  అయితే ఆసుపత్రిలో కూడ బీటెక్ రవి దీక్షను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించందని వైద్యులు ప్రకటించారు.

ఈ విషయాలను టీడీపీ ఎంపీలు  కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ కు తెలిపారు.దీంతో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ దీక్షలో ఉన్న ఎంపీ సీఎం రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీక్షను విరమించాలని సీఎం రమేష్ కోరారు. సుమారు 15 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది. 

కేంద్రం నుండి స్పష్టమైన హమీ ఇచ్చిన తర్వాతే దీక్షను విరమిస్తానని సీఎం రమేష్ కేంద్రమంత్రికి స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే బీజేపీకే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని సీఎం రమేష్ చెప్పారు.  రెండు రోజుల్లో కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే  తన డెడ్‌బాడీని చూడాల్సి వస్తోందని  సీఎం రమేష్ కేంద్ర మంత్రికి తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే ఎంపీల సమావేశం తర్వాత  కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులతో చర్చించనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. 

అధికారులతో చర్చించిన తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ  నివేదిక కూడ ఈ విషయంలో కీలకమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి  తెచ్చిన  సమాచారాన్ని మెకాన్ సంస్థకు అందించాలని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ఎంపీలకు సూచించారు.


 

loader