రైల్వేస్టేషన్ లో మహిళపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం.. అపస్మారకస్థితిలో వదిలేసి...
ఆంధ్రప్రదేశ్ లోని గురజాల రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను స్తానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ : gurajala railway stationలో ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడం కనిపించింది. ఆ మహిళ పక్కనే రెండేళ్ళ వయస్సున్న బాలుడు ఉన్నాడు. ఇది గమనించిన అక్కడివారు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన మహిళ తనమీద ఇద్దరు వ్యక్తులు molestation చేసినట్లు చెబుతోంది. ఆ మహిళ ఒడిస్సా కు చెందిన వ్యక్తిగా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆమెకు చికిత్స అందించిన వైద్యురాలు లక్ష్మీ మాట్లాడుతూ బాష అర్థంకాకపోవటంతో ఏంజరిగిందో తెలియటం లేదని తెలిపింది.
ఇదిలా ఉండగా, గత సోమవారం బెంగళూరులో minor girlపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చూసిన మరో ముగ్గురు యువకులు వారిద్దరినీ బెదిరించి ఆ మైనర్ బాలికపై rapeకి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే సోమవారంనాడు పదో తరగతి పరీక్ష రాసి స్నేహితుడితో కలిసి బాలిక గ్రామానికి వస్తుంది.. గ్రామ సమీపంలోకి రాగానే బాలికపై ఆ స్నేహితుడు అత్యాచారం చేశాడు. వీరిని వెనక నుంచి వచ్చిన ముగ్గురు యువకులు బాలికను ఆమె స్నేహితుని పట్టుకున్నారు.
మీ తతంగాన్నంతా వీడియో తీశామని.. తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ కూడా జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఇంతలో స్నేహితుడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి... గ్రామస్తులను పిలుచుకుని వచ్చాడు. గ్రామస్తులను చూసి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. బాగేపల్లి పోలీసులు స్నేహితుడితో పాటు పరారీలో ఉన్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్ రాజధాని amaravatiలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 12యేళ్ల బాలిక మీద ఆమె సవతి అన్న molestationకి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక pregnant అయ్యింది. ఈ విషయాన్ని దాచి పెట్టిన పెద్దలు.. నెలలు నిండడంతో బాలికను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకురాగా సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడైన బాలుడు కూడా మైనరే. అతనిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం గర్భవతి అయిన బాలికను ప్రసవం కోసం సోమవారం Andhra Pradeshలోని నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో అక్కడి వైద్యసిబ్బంది ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలో నివసిస్తున్న ఓ జంట ఐదేళ్ల క్రితం విడిపోయారు. వీరికి అప్పటికే పిల్లలున్నారు. వారిని భార్యదగ్గరే వదిలేశాడు. ఆ తరువాత భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడు, ఆమెకు అప్పటికే ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల పెద్దలు వీరిని కూర్చోబెట్టి మాట్లాడడంతో మళ్లీ మొదటి భార్యతో భర్తకు సయోధ్య కుదిరింది. అప్పటినుంచి వీరంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో మొదటి భార్య పెద్ద కుమారుడు (మైనర్), బాధిత బాలిక (12).. సవతి సోదరి అయ్యే అమ్మాయి మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం కుటుంబీకులకు తెలిసింది. దీనికి కారణం సవతి సోదరుడే అని తెలిసిన వారు ఏమీ చేయలేదు. సరికగా బాలికకు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ప్రసవం కోసం సోమవారం నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైద్యులు షాక్కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.