ఆటోలో వెళ్తున్న డిగ్రీ విద్యార్ధినిపై రేప్, ఇద్దరు అరెస్ట్

Two held for rape on degree student at Madanapalle in chittoor district
Highlights

 చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న యువతిపై  అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న యువతిపై  అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు అతడికి సహకరించిన ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లె మండలం బండ్లపైకి చెందిన యువతి  తమ గ్రామం నుండి  అందుబాటులో ఉన్న వాహనంపై మదనపల్లెలోని కాలేజీకి వెళ్లి డిగ్రీ చదువుతోంది.  శనివారం నాడు కూడ ఆమె ఆటోలో మదనపల్లెకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

ఆటో‌లో తమ గ్రామానికి చెందిన వెంకటేష్ ఉన్న విషయాన్ని బాధితురాలు గుర్తించింది.  ఆటో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ ఆటోను దారి మళ్లించాడు.  నల్లగుట్టవైపు ఆటోను తీసుకెళ్తుండగా బాధితురాలు అరిచింది. అయితే  వెనుక సీటులో కూర్చొన్న వెంకటేష్  ఆమె నోరును గట్టిగా మూశాడు.

ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్  వారిద్దరిని అక్కడే వదిలేసి  దూరంగా వెళ్లిపోయాడు. దీంతో విద్యార్ధిని దుస్తులను చించేశాడు. ఆమె ఎక్కడికి పారిపోదని భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 

loader