తిరుమల: ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్నో వీడియో ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. శతమానం భవతి కార్యక్రమం కోసం ఎస్బీబీసీ ఛానెల్ కు మెయిల్ చేసిన ఓ భక్తుడికి పోర్న్ లింక్ పంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఎస్వీబీసీలో పోర్న్‌సైట్ల కలకలం: ఐదుగురు ఉద్యోగుల గుర్తింపు

పోర్న్ లింక్ పొందిన భక్తుడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయమై ఎస్వీబీసీ  అధికారులతో పాటు సైబర్ క్రైమ్ టీమ్  విచారణ చేశారు.

ఈ విచారణ  చేసిన సమయంలో ఐదుగురు ఉద్యోగులు పోర్న్ సైట్లు చూస్తున్నారని గుర్తించారు. మరో 25 మంది ఉద్యోగులు మాత్రం ఇతర సైట్లు చూస్తున్నట్టుగా గుర్తించారు.శతమానం భవతి కోసం మెయిల్ చేసిన భక్తుడికి పోర్న్ సైట్ లింక్ పంపిన  ఎస్వీబీసీ లో పనిచేసే హరికృష్ణ అనే ఉద్యోగిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.

హరికృష్ణను ఇప్పటికే ఎస్వీబీసీ యాజమాన్యం తొలగించింది. ఎస్వీబీసీ ఆఫీసులో సైబర్ టీమ్ విచారణ కొనసాగుతోంది.టీటీడీ అధికారుల నివేదిక ఆధారంగా ఎస్వీబీసీ లో విధులు నిర్వహించకుండా పోర్న్ సైట్లు చూడడంతో పాటు ఇతర వ్యాపకాల్లో ఉన్న వారిని ఎస్వీబీసీ యాజమాన్యం తొలగించనుంది.