విజయవాడ గ్యాంగ్ రేప్: ముగ్గురి అరెస్ట్,నున్న పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా విజయవాడ సీపీ చెప్పారు. ఈ ఘటనలో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు.
విజయవాడ: vijayayawadaలో మతిస్థిమితం సరిగా లేని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 29వ తేదీన యువతి ఇంటి నుండి వెళ్లిపోయింది. అయితే యువతిని విజయవాడ hospital లో పనిచేసే యువకుడు తీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులుఆరోపిస్తున్నారు. ఈ యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతిపై :gang rape పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.
సరిగా మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నున్న పోలీస్ స్టేషన్ వద్ద లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ కేసును దిశ ఏసీపీ దర్యాప్తు చేస్తున్నట్టుగా విజయవాడ సీపీ ప్రకటించారు. నిందితులను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. నున్న పోలీస్ స్టేసన్ ముందు ఆందోళన చేస్తున్న లెఫ్ట్ పార్టీ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సమయంలో పోలీసులకు, లెఫ్ట్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
యువతి ఇంటి నుండి వెళ్లిపోయిన విషయాన్ని గుర్తించి పిర్యాదు చేసినప్పటికీ police సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.తమకు అనుమానం నిందితుడి పోన్ నెంబర్ ను పోలీసులకు ఇచ్చినా కూడా సరిగా స్పందించలేదని బాధితురాలి సోదరుడు చెప్పారు. తాము చెప్పినప్పుడే పోలీసులు స్పందిస్తే తమ సోదరిపై ఈ దారునం జరిగి ఉండేది కాదన్నారు.
భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా బాధిత కుటుంబం కోరుతుంది. నిందితులను ఉరి తీయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తుంది. బయట ప్రపంచం తెలియని తన బిడ్డపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.