ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వక్రబుద్దితో సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. విద్యార్థులకు జ్ఞానం నేర్పాల్సిందిపోయి తప్పుడు పాఠాలు నేర్పుతూ ప్రజల చేతిలో బడితపూజ చేయించుకున్నారు. 

ఈ దారుణం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో చోటు చేసుకుంది. ఉర్లగూడెం ప్రభత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు రేప్ ఎలా చేస్తారో చూపించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేశారు. 

ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు డెమో రేప్ కు విద్యార్థులు అంగీకరించాల్సి వచ్చింది. ఈ డెమో రేప్ ఘటనలో ఓ విద్యార్థినికి గాయాలపాలయ్యాయి. గాయాలు కాలవ్వడంతో విద్యార్థినిని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వారంతా ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్థులు పాఠశాల ఉపాధ్యాయులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఉపాధ్యాయులు ఇద్దరిపై రూ.80వేలు భారీ జరిమానా విధించారు. 

అంతటితో ఊరుకోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో వ్యవహారం కాస్త డీఎస్పీ దృష్టికి వెళ్లింది. దాంతో డీఎస్పీ డిఈవోకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని డిఈవో ఎంఈవోకు ఆదేశించారు.