Asianet News TeluguAsianet News Telugu

గోడలను బద్దలు కొట్టుకునైనా... నరసరావుపేటకు వెళతాం..: టిడిపి అనిత స్పష్టం

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఎంత నిర్బంధించినా చివరకు గోడలు బద్దలుగొట్టుకునైనా నరసరావుపేటకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టం చేశారు. 

TDP Woman Wing  Chief Anitha Serious comments on narasaraopet tour
Author
Amaravati, First Published Sep 9, 2021, 9:33 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించిన నరసరావుపేట వెళ్లి తీరుతామని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహిళలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలంతా అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనిత పిలుపునిచ్చారు. 

''ఉన్మాది చేతిలో హత్యకు గురైన అనూషకి న్యాయం చేయాలని కోరేందుకు నరసరావుపేట వస్తుంటే...వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా నరసరావుపేట వెళ్లి తీరుతాం. పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే గోడలను బద్దలు కొట్టుకునైనా  వెళ్తాం'' అని హెచ్చరించారు. 

''తాడేపల్లి ఆదేశాలతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రం వైసీపీ నేతల జాగీరా.? ప్రతిపక్ష పార్టీలకు బాధిత కుటుంబాలకు అండగా నిలబడే హక్కు లేదా? బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే  మీకెందుకు భయం.?'' అని నిలదీశారు.

''అనూష హత్యకు గురై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు నిందితుడిపై చర్యలు లేవు. టీడీపీ అక్కడికి వస్తుండేసరికి అతనిపై ఛార్జ్ షీట్ వేశాం... విచారణ జరుగుతుందని కబుర్లు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను అడ్డుకోవడంలో పెట్టిన శ్రద్ధ బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వుండాలి. టీడీపీ ఏ పోరాటానికి పిలుపునిచ్చినా అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు... ఏం మీ అరాచక, అవినీతి భాగోతాలు బయటపడతాయని భయమా?'' అని అనిత ప్రశ్నించారు. 

read more  నర్సరావుపేటలో లోకేష్‌ పర్యటనకు అనుమతి నిరాకరణ.. పోలీసులపై టీడీపీ నేతల విమర్శలు
 
ఇక ఎపిటిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి.ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన గురించి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. అన్యాయంగా హతమార్చిన తెలుగింటి ఆడబిడ్డ అనూష కుటుంబాన్ని పరామర్శిస్తే డిజిపి కి గాని, పోలీసు అధికారులకు గాని ఉలికిపాటు ఎందుకు? అనూష సోదరి కుటుంబానికి పరామర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? అని నిలదీశారు. 

''లొకేష్ పర్యటనను టిఎన్ఎస్ఎఫ్ ముందుండి విజయవంతం చేస్తాం. ప్రజాస్వామ్య హక్కులు పోలీసులు అణచివేయాలని చూస్తే సహించేది లేదు. అసలు అమలులో లేని దిశాచట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని గుంటూరు డి.ఐ.జి, గుంటూరు రూరల్ ఎస్పీ ఏవిధంగా చెబుతారు? రాష్ట్ర డిజిపి దిశాచట్టం అమలులో లేదని చెబుతుంటే, గుంటూరు పోలీసు అధికారులు చట్టం అమలులో ఉందని ఎలా చెబుతారు?'' అని ప్రశ్నించారు. 

''లోకేష్ పర్యటనను అప్రజాస్వామికంగా అడ్డుకుంటే టిఎన్ఎస్ఎఫ్ ప్రతిఘటిస్తుంది. సానుభూతి కోసం ఓదార్పు చేసిన జగన్ రెడ్డిది శవ రాజకీయమా?తెలుగుదేశం పార్టీది శవ రాజకీయమా? శాంతిభద్రతలను పరిరక్షించడం చేతగాని అధికారులు బాధ్యతల నుండి తప్పుకోవాలి. అధికార పార్టీ కార్యక్రమాలకు అడ్డుగా లేని కోవిడ్ నిబంధనలు ప్రతిపక్ష నేతకేలా? మీరు పోలీసులా?లేదా అధికార పార్టీకి గులాంగిరీ చేసే పాలెగాండ్లా'' అని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios