Asianet News Telugu

చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్: ఆఖర్లో వచ్చి ఫోన్లో మాట్లాడుతానంటూ వెళ్లిపోయిన గంటా

చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ కు ఆఖర్లో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించారు. అలాగే తనపై జరుగుతున్న ప్రచారంపై కూడా చంద్రబాబుకు వివరణ ఇచ్చారు గంటా శ్రీనివాస్. మిగిలిన విషయాలు వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడుతానంటూ గంటా వెళ్లిపోయారు. 

tdp president chandrababu teleconference with tdp leaders
Author
Amaravathi, First Published Jun 22, 2019, 5:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, కొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటున్న వార్తలపై చంద్రబాబు చర్చించారు. 

చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ కు ఆఖర్లో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించారు. అలాగే తనపై జరుగుతున్న ప్రచారంపై కూడా చంద్రబాబుకు వివరణ ఇచ్చారు గంటా శ్రీనివాస్. మిగిలిన విషయాలు వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడుతానంటూ గంటా వెళ్లిపోయారు. 

గంటా శ్రీనివాసరావు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనతోపాటు 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్లే బాధ్యతను గంటా శ్రీనివాసరావు భుజాన ఎత్తుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుతో వ్యక్తిగతంగా మాట్లాడతానంటూ గంటా వెళ్లిపోయారు. 

ఇకపోతే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ముమ్మాటికి ఫిరాయింపు కిందకే వస్తుందని టీడీపీ నేతలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. న‌లుగురు ఎంపీల విలీనం అనైతికం, అప్రజాస్వామిక‌మని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు టెలీకాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీల విలీనంపై న్యాయ పోరాటానికి సంబంధించిన అంశాలపై పరిశీలిస్తున్నట్లు చంద్రబాబుకు స్పష్టం చేశారు. 

నీతిమంత‌మైన పాల‌న అందిస్తామ‌ని చెప్పిన బీజేపీ అడ్డగోలుగా టీడీపీ ఎంపీలను చేర్చుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. ఒక పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికైన వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

పార్టీలో చేర్చుకున్న రోజే రాజ్యస‌భ వెబ్‌సైట్‌లో బీజేపీ స‌భ్యులుగా  టీడీపీ ఎంపీల‌ను చూపించ‌డం కేంద్రం వ్యవ‌హార‌ శైలిని స్పష్టం చేస్తోంద‌న్నారు. ప్రత్యేక‌హోదా కోసం కేంద్రంతో పోరాడిన చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఇటువంటి చ‌ర్యల‌కు పాల్పడుతున్నార‌ని దేవినేని ఆరోపించారు. 

తెలుగుదేశం పార్టీని మరింత బ‌ల‌హీనప‌రిచే ప్రయ‌త్నాల‌ను తిప్పికొట్టాల‌ని మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర సూచించారు. కొంద‌రు బీజేపీ నేతలు క‌ల‌లు కంటున్నట్టు టీడీపీ మునిగిపోయే నావ కాదన్నారు కొల్లు రవీంద్ర. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్యాడ‌ర్‌పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. గ్రామాల్లో టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ దాడులపై ఏపీ డీజీపిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

అగ్రవ‌ర్ణ వైసీపీ నేత‌లు ద‌ళితుల‌పై దాడులకు పాల్పడుతున్నారని ఆ దాడులను తాము ఖండిస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా కడతావో చూస్తానంటూ జలదీక్ష చేసిన వైయస్ జగన్ సీఎం హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా హాజరవుతారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios