Asianet News TeluguAsianet News Telugu

ఆ మందు కరోనా కంటే ప్రమాదం... వెయ్యిరూపాయలు అందుకేనా?: అచ్చెన్నాయుడు ఆగ్రహం

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్  తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. 

TDP MLA Kinjarapu Atchannaidu fires on YS Jagan Decisions over coronavirus
Author
Guntur, First Published Mar 23, 2020, 4:32 PM IST

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ తన ఆదాయాన్ని తగ్గకుండా చూసుకుంటున్నారని టిడిపి ఎమ్మల్యే కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కరోనా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని తెలిసినా మధ్యం అమ్మకాలపై నిషేదం విధించకపోవడం ఇందులో భాగమేనన్నారు. కరోనా కంటే అత్యంత  ప్రమాదకరమైన  బ్రాండ్లను అమ్ముతూ ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేతోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

''తుగ్లక్ ముఖ్యమంత్రి అయితే మందు కూడా నిత్యావసరమే...నేనొస్తున్నా సంపూర్ణ మద్యపాన నిషేధమే అన్న జగన్ కరోనా వచ్చి జనాలు చస్తున్నా చెత్త మందు ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రం వదులుకోవడానికి సిద్ద పడటం లేదు. కల్తీ సారా కంటే దారుణమైన బ్రాండ్లు అమ్మడానికి కోట్లు కొట్టేసారు'' అని సీఎం జగన్ పై తీవ్ర ఆరోపించారు. 
 
''ఆ మందు కరోనా కంటే ప్రమాదం.ఇప్పుడు సడెన్ గా షాపులు మూసెయ్యడానికి దొంగ లిక్కర్ మాఫియా అంగీకరించినట్టు లేదు.  ఇచ్చే వెయ్యి రూపాయిలు మందు అమ్మి దొబ్బెయ్యాలి అంతేగా రివర్స్ టెండరింగ్ సీఎం గారు'' అని జగన్పై సెటైర్లు విసిరారు అచ్చెన్నాయుడు. 

కరోనా వైరస్ నిరోదానికి వైసిపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గతంలోనూ అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మద్యం అమ్మకాలు రాష్ట్రంలో యదేచ్చగా జరగడంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

''ఈ శ‌తాబ్దంలో తొలిసారిగా తిరుమ‌ల గుడి మూయించారు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా వేశారు. జ‌న‌త క‌ర్ఫ్యూకి దేశ‌మంతా స‌మాయ‌త్త‌మ‌వుతుంటే జ‌గ‌న్ మ‌ద్యం షాపులు బార్లా ఎలా తెరిచారు? వైన్‌షాపుల ముందు గుంపులలో ఒక్కరికి వైరస్ సోకినా ఎంత ప్రమాదమో ఆలోచించారా?'' అంటూ ఏపిలో ప్రస్తుతం వైన్ షాప్ ల ముందు గుమిగూడిన జనాలతో కూడిన వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారు. 
 
''మ‌నిషికి మ‌నిషికి సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌పంచ‌మంతా ఘోషిస్తుంటే, ఎక్కుకుంటూ, తొక్కుకుంటూ మ‌ద్యం కోసం ఎగ‌బడుతున్న వారివ‌ల్ల క‌రోనా వ్యాప్తి చెంద‌దా జ‌గ‌న్ గారూ!'' అని ప్రశ్నించారు. 

''మార్చి నెల చివరి వారంలోకి వస్తున్నాం. మార్చి 31 లోపు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకపోతే, ఏప్రిల్ నెల జీతాలు కూడా ఇవ్వటానికి వీలు ఉండదు. మరో పక్క కరోనా విస్తరించకుండా గృహ నిర్భంధాలు అమలు చేస్తే, పేదలకు రేషన్, నగదు సహాయం మాటేంటి? ఆర్థిక మంత్రిగారికి వీటికంటే ఎన్నికలే ముఖ్యంలా ఉంది'' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios