Asianet News TeluguAsianet News Telugu

ప్రియున్ని కట్టేసి గ్యాంగ్ రేప్... నిందితుల వెనకుంది ఆ వైసిపి ఎమ్మెల్యేలే: టిడిపి అనిత సంచలనం

గుంటూరు జిల్లా యువతిపై అత్యాచార ఘటనలో నిందితులు వైపీపీకి చెందినవారు కావడంవల్లే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. 

tdp leader vangalapudi anitha sensational comments on seethanagaram rape case akp
Author
Guntur, First Published Jul 8, 2021, 9:32 AM IST

అమరావతి; మహిళల మీద దాడి చేసిన వాడి గుడ్లు పీకేలా ముఖ్యమంత్రి వుండాలి అన్న జగన్ రెడ్డి రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారు? అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. సీతానగరంలో దళిత యువతిపై జరిగిన అత్యాచారం కేసులో  పురోగతి లేకపోవడానికి అధికార వైసిపి నాయకులే కారణమన్నారు. నిందితులు వైపీపీకి చెందినవారు కావడంవల్లే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనిత ఆరోపించారు. 

''అత్యాచారం నిందితుల వెనక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వున్నారు. ఆర్కే ఇంట్లో సోదాలు చేస్తే నిందితులకు సంబంధించిన సమాచారం పూర్తిగా దొరుకుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ ఉదంతంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదు.? నిందితులు వైసీపీ వారు కాబట్టి మిన్నుకుండిపోయారా?'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''దిశ యాప్ ద్వారా మహిళలను ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. నేతిబీరకాయలో నేతి వుండదు.. జగన్ తెచ్చిన చట్టాల్లో నిబద్ధత వుండదు. జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో 520పైగా మహిళల మీద అత్యాచారాలు, దాడులు జరిగాయి. ఏ మహిళకు కూడా న్యాయం చేయలేదు'' అని మండిపడ్డారు. 

read more  ప్రియుడ్ని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్ కేసు: ముప్పు తిప్పలు పెడుతున్న కృష్ణ

''పులివెందుల్లో అత్యాచారానికి, హత్యకు గురైన నాగమ్మ కేసును మరుగున పడేసినట్లే సీతానగరం కేసును కూడా మరుగున పడేస్తారన్న అనుమానం కలుగుతోంది. ఇన్ని అరాచకాలు, దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ లో చీమకుట్టినట్లు కూడా లేదు'' అన్నారు. 

''దిశ చట్టం ద్వారా నిందితులకు శిక్ష విధించినట్లు సిగ్గు లేకుండా హోమంత్రి ప్రచారం చేసుకుంటున్నారు. సీతానగరం యువతి కేసులో నిందితులను శిక్షించకపోతే మహిళా లోకమంతా కలసి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తాం. ఆడబిడ్డలకు అన్నగా వుంటానని..కిరాతకుల పాలిట ఆపద్భాందవునిగా జగన్ నిలుస్తున్నారు. మహిళల పాపం ఊరికేపోదు'' అని అనిత హెచ్చరించారు. .            
 

Follow Us:
Download App:
  • android
  • ios