అమరావతి: టీడీపీ ఎంపీలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సమయంలో  ఉక్కు దీక్షకు సంబంధించి కొందరు టీడీపీ ఎంపీలు చేసిన  సరదా వ్యాఖ్యలపై  ఆయన మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయకూడదని బాబబు ఎంపీలకు సూచించారు. అయితే తమ వ్యాఖ్యలను మీడియా ఎడిటింగ్ చేసి వదిలారని ఎంపీలు వివరణ ఇచ్చారు.

టీడీపీ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో  ఎంపీల తీరును తప్పుబుట్టారు. ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ  సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సమయంలో ఢిల్లీలో కొందరు  టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై బాబు మండిపడ్డారు.

టీడీపీ ఎంపీ దీక్ష చేస్తున్న తరుణంలో  తప్పుడు పద్దతిలో మాట్లాడడం సరైంది కాదన్నారు. టీడీపీ చేస్తున్న పోరాటంపై బురదచల్లే విధంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు.  ఎవరుపడితే వారు ఏది పడితే అది మాట్లాడడం సరికాదన్నారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సమయంలో  కొందరు ఎంపీలు సరదాగా చేసిన వ్యాఖ్యలపై  ఆయన మండిపడ్డారు.  ఈ వ్యాఖ్యలు సరికావన్నారు. అయితే  తమ  వ్యాఖ్యలను మీడియా ఎడిటింగ్ చేసి ప్రసారం చేశారని ఎంపీలు మురళీ మోహన్, ఆవంతి శ్రీనివాస్ చెప్పారు. 

ఛలోక్తులకు ఇది సమయం కాదని బాబు ఎంపీలకు హితవు పలికారు.  సరదాగా కూడ ఇలా వ్యాఖ్యానించకూడదని బాబు ఎంపీలకు సూచించారు. 75 ఏళ్ళ వయస్సులో  కూడ  తాను వారం  రోజుల పాటు దీక్ష చేయగలనని  మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు కూడ ప్రస్తావించినట్టు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలపై మురళీమోహన్ వివరణ ఇచ్చారు. 

ఎంపీల వ్యాఖ్యలపై విచారణ జరిపిస్తానని బాబు చెప్పారు. తప్పుడుగా వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకొంటామని బాబు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కూడ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.