Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లి అత్యాచారం కేసులో ఏ-2 నిందితుడి వివరాలు.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన పోలీసులు...

ప్రసన్న రెడ్డి అలియాస్ వెంకట్ కోసం  నూట ఇరవై రోజులుగా గాలిస్తున్నారు.  అయినా ఫలితం లేదు.  అతడిని పౌరులు గుర్తించేలా రెండు పాత ఫోటోలు ఇతర వివరాలు facebookలో పోలీసులు ఆదివారం పోస్ట్ చేశారు.

tadepalli gang rape case accused A-2 details released by police
Author
Hyderabad, First Published Oct 18, 2021, 8:16 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తాడేపల్లి : రాష్ట్రంలో సంచలనం కలిగించిన Thadepalli rape incidentలో Accused ఆచూకీ ఇంకా తెలియలేదు.  సీతానగరం పుష్కర ఘాట్ వద్ద కొన్ని నెలల కిందట ఓ యువతిపై కొందరు అత్యాచారం చేయగా ఈ ఏడాది జూన్ 19న పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ కేసులో ఏ-2 రామలింగం ప్రసన్న రెడ్డి అలియాస్ వెంకట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఘటన జరిగిన నలభై ఎనిమిది రోజులకు ఆగస్టు 7న ఎ-1 షేర్ కృష్ణతో పాటు అతని వద్ద సెల్ ఫోన్లు తాకట్టు పెట్టుకున్న మరో వ్యక్తిని ఎ-3గా చూపి అరెస్టు చేశారు. 

ప్రసన్న రెడ్డి అలియాస్ వెంకట్ కోసం  నూట ఇరవై రోజులుగా గాలిస్తున్నారు.  అయినా ఫలితం లేదు.  అతడిని పౌరులు గుర్తించేలా రెండు పాత ఫోటోలు ఇతర వివరాలు facebookలో పోలీసులు ఆదివారం పోస్ట్ చేశారు.

ఏ-2 వివరాలివీ...
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కుక్కలవారిపాలేనికి చెందిన రామలింగం ప్రసన్న రెడ్డి అలియాస్ వెంకట్ (22)  కుడి చేతిపై పుణ్యవతి అనే Tattoo ఉంటుంది. తాపీ పని, కబోర్డులు అమర్చే పనులతోపాటు కర్ర నరకటం, వరికుప్పలనూర్పిడి,  క్యాటరింగ్ కి వెళ్లడం,  రైళ్లలో యాచిస్తూ, సమోసాలు విక్రయించే వారితో తిరుగుతాడు.  రైలు పట్టాల పక్కన,  అండర్పాస్ లు,  పాడుబడిన భవనాలు,  హైవే అండర్పాస్,  అన్న దానాలు చేసి ఆలయాల వద్ద ఆశ్రయం తీసుకుంటున్నట్లు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తిస్తే  మంగళగిరి మండలం  డి.ఎస్.పి,  లేదా తాడేపల్లి సీఐ, ఎస్ఐలకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

గుంటూరు గ్యాంగ్‌రేప్‌‌లో కీలక మలుపు: స్నేహితుడికి కృష్ణ ఫోన్, విచారిస్తున్న పోలీసులు

కాగా, జూన్ 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ వద్ద love coupleపై జరిగిన అఘాయిత్యం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజు ప్రేయసీప్రియులు రాత్రి 8.30 గంటలకు Pushkarghat కు చేరుకున్నారు. 

బాధితురాలు నర్సుగా పనిచేస్తోంది. తనకు పరిచయం ఏర్పడిన యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ గురించి ఇద్దరు తమ కుటుంబాలకు చెప్పారు. వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో ఇరువురు తరుచుగా కలుసుకుంటూ వస్తున్నారు. ఘటన జరిగిన రోజు యువకుడు ప్రేయసికి ఫోన్ చేశాడు. దాంతో డ్యూటీ ముగిసిన వెంటనే బాధితురాలు యువకుడిని కలుసుకుంది. వారిద్దరు పుష్కర ఘాట్ కు చేరుకున్నారు.  ఆ సమయంలో దుండగులు వారిని చూశారు. 

తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసు: అనుమానితుడిపై పలు కేసులు, దర్యాప్తులో కీలక విషయాలు

యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి యువతిపై gang rape చేశారు. దానికి ముందు వారు మాటలను యువతి సెల్ లో రికార్డు చేసింది. ఆ రికార్డును పోలీసుులు పరిశీలిస్తున్నారు.  సమయం గడుస్తున్నా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేస్తే కలువలేదు. చివరకు రాత్రి 11 గంటలకు యువతి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఏడుస్తూ ఆమె వారితో మాట్లాడింది. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకడి ఫొటో పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమ జంటపై జరిగిన అఘాయిత్యం కేసులో ప్రకాశం బ్యారేజీ దిగువ భాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై సామూహిక అత్యాచారం చేసి నాటు పడవపై విజయవాడ వైపు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. అప్పటికే చీకటి పడడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులు తెలిపారు. యువతితో పాటు యువకుడిని పోలీసులు తమ వెంట తీసుకుని వెళ్లి రెండు జిల్లాల్లోని అనుమానితులను చూపించారు. 

కేసు దర్యాప్తులో భాగంగా అనంతరం తాడేపల్లి అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏ 1 కృష్ణ, ఏ3 హబీబ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో వున్న ఏ 2 వెంకట్‌ కోసం వెతుకుతున్నారు. అత్యాచార ఘటనకు గంట ముందు ఏ 1 కృష్ణ ఒక హత్య చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios