Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు షాక్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవో పై స్టే విధించిన సుప్రీం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు  బుధవారం నాడు స్టే విధించింది.

Supreme court stays Ap local body elections
Author
Amaravathi, First Published Jan 15, 2020, 11:47 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్నికల నిర్వహణ కోసం విడుదల చేసిన జీవోపై సుప్రీంకోర్టు బుధవారం నాడు స్టే విధించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో  50 శాతానికి మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో పాటు మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ చేసింది.

Also read:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అంశం ఏపీ తరపు ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం విడుదల చేసిన జీవో 176పై సుప్రీంకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో ఈ రిజర్వేషన్ల అంశంపై ఏపీ హైకోర్టు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  నోటీపికేషన్ విడుదలను నిలిపివేయాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఈ నెల 17వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటీఫికేషన్ విడుదల కావాల్సిన తరుణంలో సుప్రీంకోర్టు జగన్ సర్కార్ కు షాకిచ్చింది.

Also read:సచివాలయానికి జగన్... వారికి ఆంక్షలు.. భోజనం కూడా చేయనివ్వకుండా

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్‌‌కు హైకోర్టు ఇటీవల ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు దశల్లో మండల పరిషత్ ఎన్నికలు, మూడు దశల్లో  గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు  ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్‌కు ఏపీ రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పింది.

జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 10వ తేదీన  ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.   ఇక గ్రామ పంచాయితీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని తలపెట్టారు.

గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఫిబ్రవరి 8వ తేదీన నోటీఫికేషన్ వెలువడనుంది. మార్చి 3వ తేదీన ఎన్నికలు పూర్తి కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలు విషయమై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయని ప్రతాప్ రెడ్డి ఈ పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే  స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు విముఖతను చూపింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన  అఫిడవిట్‌ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు  హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios