Asianet News TeluguAsianet News Telugu

మండలి రద్దు దిశగా జగన్: ఛైర్మన్, స్పీకర్‌‌లను పిలిపించిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ హరిచందన్ ఆరా తీశారు. ఆదివారం స్పీకర్ తమ్మినేని, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ను పిలిపించిన గవర్నర్ ఇద్దరితో విడివిడిగా భేటీ అయ్యారు. 

speaker tammineni and chairman sharif meets ap governor biswabhusan harichandan
Author
Amaravathi, First Published Jan 26, 2020, 2:27 PM IST

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ హరిచందన్ ఆరా తీశారు. ఆదివారం స్పీకర్ తమ్మినేని, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ను పిలిపించిన గవర్నర్ ఇద్దరితో విడివిడిగా భేటీ అయ్యారు.

శాసనమండలిని రద్దు చేయాలని వైఎస్ జగన్ దాదాపుగా ఖరారు కావడంతో పాటు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ 29 గ్రామాల రైతులు ఆందోళనను ఇంకా కొనసాగిస్తుండటంతో గవర్నర్ జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత కలిగిస్తోంది. కాగా అంతకుముందు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. 

Also Read:అభివృద్ధి కోసమే మూడు రాజధానులు: గవర్నర్ బిశ్వభూషణ్

విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్‌లో జ్యుడీషియల్‌ రాజధాని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గవర్నర్ చెప్పారు. . పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

అభివృద్ది, పాలనా వికేంద్రీకరణతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హరిచందన్  అభిప్రాయపడ్డారు.  ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నవరత్నాలను తీసుకొచ్చిందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయన్నారు.

సచివాలయల ఏర్పాటుతో 4లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.  . రైతు భరోసా పథకం రూ.13,500 మందికి ఇస్తున్నామన్నారు.  ధరల స్థిరీకరణ కోసం రూ.3 కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Also Read:టీడీఎల్పీ భేటీ: ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా, బాబుకు షాకిస్తారా?

రైతులకు 9గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తోన్న విషయాన్ని  గవర్నర్ గుర్తు చేశారు.  100 శాతం అక్షరాస్యతకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.  ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతోందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా కూడ తెలుగును తప్పనిసరి చేసిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.

మనబడి, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు.  . ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios