Asianet News TeluguAsianet News Telugu

గంపమల్లయ్య స్వామి కొండ మీదినుంచి జారి పూజారి మృతి (వీడియో)

ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన పుణ్యక్షేత్రం గంపమల్లయ్య స్వామి కొండ మీది దేవాలయం. అనంతపురం జిల్లా సింగనమలలోని గంపమల్లయ స్వామి కొండపై వెలిసిన స్వామిని దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సి ఉంటుంది. 

slipped from gampamallaiah swamy hill priest died in anantapur
Author
Hyderabad, First Published Aug 21, 2021, 11:57 AM IST

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ పూజారి కొండమీదినుంచి పడిపోయి తుదిశ్వాస విడిచాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. 

"

ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన పుణ్యక్షేత్రం గంపమల్లయ్య స్వామి కొండ మీది దేవాలయం. అనంతపురం జిల్లా సింగనమలలోని గంపమల్లయ స్వామి కొండపై వెలిసిన స్వామిని దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సి ఉంటుంది. రాళ్లు, కొండల బాటలో నడిచి కొండ మీదికి చేరుకోవాలి. అడవి మీదుగా ఏడు కొండలు దాటితే కానీ దేవాలయాన్ని చేరుకోలేం. 

"

ఎత్తైన కొండ మీదినుంచి కిందికి దిగితే ఓ గుహ ఉంటుంది. ఆ గుహలోనే గంపమల్లయ్య స్వామి కొలువు దీరి ఉంటాడు. ఆ గుహలోకి వెళ్లి నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వడమే అసలైన విశేషం. ఇది అక్కడి పూజారి పాపయ్యకే సాధ్యం. వంశపారంపర్యంగా వీరికి ఈ పూజాకార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. 

నున్నటి కొండల మీద ఓ చేత్తో హారతి, మరో చేత గంట పట్టుకుని ఏ సాయం లేకుండా.. వేగంగా లోయలోకి దిగుతాడు. ఇలా దిగుతున్న క్రమంలోనే పట్టుతప్పి... పాపయ్య కొండ పైనుంచి ఎకాఎకి కింద పడి చనిపోవడంతో... ఇప్పుడక్కడ విషాదం చోటు చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios