Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు‌ గ్యాంగ్‌రేప్ కేసు: కీలకంగా మారిన సెల్‌ఫోన్లు, తాకట్టులో బాధితుల మొబైల్స్

గుంటూరు రేప్ కేసులో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. బాధితురాలు ఆమెతో వున్న యువకుడి దగ్గర సెల్‌ఫోన్లు లాక్కొన్న నిందితులు వాటిని సీతానగరంలో తాకట్టు పెట్టి పరారయ్యారు. ఫోన్లు తాకట్టు పెట్టుకున్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

sitangaram gang rape case updates ksp
Author
Amaravathi, First Published Jun 22, 2021, 3:34 PM IST

గుంటూరు రేప్ కేసులో మొబైల్ ఫోన్లు కీలకంగా మారాయి. బాధితురాలు ఆమెతో వున్న యువకుడి దగ్గర సెల్‌ఫోన్లు లాక్కొన్న నిందితులు వాటిని సీతానగరంలో తాకట్టు పెట్టి పరారయ్యారు. ఫోన్లు తాకట్టు పెట్టుకున్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

మరోవైపు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని ఏపీ హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారాన్ని అందించారు. బాధితురాలి తల్లి ఆ చెక్‌ను అందుకున్నారు. తాడేపల్లి అత్యాచార బాధితురాలి ఆరోగ్యం మెరుగు పడిందన్నారు గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి. బాధిత యువతికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 

Also Read:గుంటూరు‌ గ్యాంగ్‌రేప్ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

అంతకుముందు గ్యాంగ్‌రేప్ చేసిన ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేష్ లను  పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని సమాచారం. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని నిందితులు దాడులు చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితుల నుండి దోచుకొన్న సొమ్ముతో గంజాయి కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు  నిందితులను గుర్తించిందని సమాచారం.నాలుగు రోజుల క్రితం ప్రియుడితో పుష్కరఘాట్ వద్దకు వెళ్లిన యువతిపై నిందితులు అత్యాచారం చేశారు. ప్రియుడిని కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios