విజయవాడ సెక్స్ రాకెట్: ఎస్ఐ సుబ్బారావుపై వేటు

First Published 24, Jun 2018, 9:21 AM IST
SI suspended for ignoring complaints against prostitution racket in city
Highlights

విజయవాడ సెక్స్ రాకెట్ లో ఎస్ఐపై వేటు


 విజయవాడ: విజయవాడ జక్కంపూడి కాలనీలో సెక్స్ రాకెట్ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన  ఎస్సై సుబ్బారావును సస్పెండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ సీపీ గౌతం సవాంగ్  ఆదేశాలు జారీ చేశారు.

విజయవాడ జక్కంపూడి కాలనీలో  ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని శోభారాణి దంపతులు వ్యభిచారంలోకి దింపారు. అయితే వ్యభిచారానికి సహకరించకపోతే ఆ యువతిని శోభారాణి దంపతులు చిత్రహింసలకు గురిచేశారు. 

అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు తాజాగా ఆరోపించారు. అప్పట్లో  విజయవాడ టూటౌన్‌ ఎస్ఐగా పనిచేసిన సుబ్బారావు ప్రస్తుతం గన్నవరం ఎస్ఐగా పనిచేస్తున్నారు. 

జక్కంపూడి కాలనీలో వ్యభిచారం కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించిన ఎస్ఐ సుబ్బారావును సస్పెండ్ చేస్తూ విజయవాడ సీపీ గౌతం సవాంగ్ శనివారం రాత్రి ఆదేశాలు  జారీ చేశారు. 

జక్కంపూడి కాలనీలో వ్యభిచారం విషయాన్ని మీడియా బయటపెట్టింది. దీంతో ఈ విషయమై విచారణ నిర్వహించిన నివేదిక ఇవ్వడంతో ఎస్ఐ సుబ్బారావును సస్పెండ్ చేస్తూ సీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలనే సుబ్బారావు విజయవాడ టూటౌన్ నుండి గన్నవరానికి బదిలీపై వచ్చారు.సాధారణ బదిలీల్లో భాగంగానే సుబ్బారావు గన్నవరం పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు.

loader