Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలోకి త్వరలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ పరిస్థితులు రోజుకో విధంగా యూ టర్న్ తీసుకుంటున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ నేతలు వైకాపా పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

sajjala ramakrishna reedy comments on tdp
Author
Amaravathi, First Published Jan 27, 2020, 9:05 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రోజుకో విధంగా యూ టర్న్ తీసుకుంటున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ నేతలు వైకాపా పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ టీమ్ లో చేరగా ఇప్పుడు మరో 17 మంది కూడా ఫ్యాన్ గాలి వైపు యూ టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ అనుమానాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరీంత బలాన్ని చేకూర్చారు. మండలి రద్దుకు అసలు కారణం టీడీపీ వల్లేనని చెప్పిన ఆయన జగన్ అందుకు తగ్గటుగా వ్యవహరించారని అన్నారు.

ఆదివారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల 17 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారనే కామెంట్స్ పై  స్పందిస్తూ.. 'ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టాల్సిన అవసరం మాకేమి లేదు. వారి సొంత నిర్ణయంతోనే వైకాపా పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారిని మేమేం చేసుకోవాలి. టీడీపీ నాయకుల వ్యవహార శైలి తప్పుగా ఉండడం వల్ల జగన్ కి శాసన సభ మండలిని రద్దు ఆలోచన వచ్చింది.

ఇక మండలి రద్దుపై తీర్మానం చేసి పంపినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదు. బిల్లుల స్థానంలో ఆర్డినెన్సు తెచ్చే అవకాశం గవర్నమెంట్ కి ఉంది. మండలిలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే బిల్లులు సెలక్టు కమిటీకి వెళ్తాయి. ఈ ప్రాసెస్ అమలుకు టైమ్ పడుతుంది.  శాసన మండలి ద్వారా అనవసర రాజకీయాలు, చికాకులు తప్ప మరొక ఉపయోగం లేదనిపిస్తోంది. మండలి రద్దుకు చర్చలు జరుగుతున్నాయి  సోమవారం ప్రభుత్వం ఈ విషయంపై ఒక నిర్ణయానికి వస్తుంది' అని సజ్జల రామకృష్ణ రెడ్డి వివరణ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios