కుప్పం రోడ్డులో ఇన్నోవా, బైక్ ఢీ, మంటల్లో చిక్కుకుని నలుగురు యువకుల మృతి

road accident in kuppam
Highlights

ఐదుగురికి తీవ్ర గాయాలు...
 

చిత్తూరు జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పలమనేరు నుండి నలుగురు విద్యార్థులు ఒకే బైక్ పై తమ స్వగ్రామానికి బయలేదేరారు. అయితూ వీరి బైక్ పలమనేరు-కుప్పం రహదారిపై వేగంగా వస్తున్న ఓ ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం మోటార్ బైక్ పై ఉన్న నలుగురు యువకులు మృతి చెందారు. ఇన్నోవాలోని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు నుంచి కిషోర్‌ (20), తేజ (22), వినోద్‌ (21), వంశీధర్‌ (20) అనే నలుగురు యువకులు తమ స్వగ్రామం బైరెడ్డిపల్లె ఒకే మోటర్‌ సైకిల్‌ పై బయలేదేరారు. అయితే వీరి బైక్ ఇల్లూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఓ ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదానికి గురవగానే బైక్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద గాయాలతో పాటు మంటల్లో చిక్కుకున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. 

ఇక ఇన్నోవా లో ప్రయాణిస్తున్న వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.   ఇన్నోవా డ్రైవర్‌ చెన్నకేశవుల నాయుడు తో పాటు మనోహర్‌,  సిద్దయ్య నాయుడు, మోహన్‌ రాజు లు తీవ్రంగా గాయపడ్డారు.  

ఈ ప్రమాదం గురించి స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే క్షతగాత్రులను కుప్పం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంటల్లో కాలిపోయిన మృతదేహాలను పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


 

loader