అమరావతి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ కు కీలక పదవి కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. శామ్యూల్ ను సీఎం సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న నవరత్నాల అమలు భాధ్యతను సైతం ఆయనకు కట్టబెట్టింది. నవరత్నాలు కార్యక్రమానికి వైస్ చైర్మన్ గా శామ్యూల్ ను నియమించింది. శామ్యూల్ మూడేళ్లపాటు కేబినెట్ హోదాలో ఈ పదవిలో కొనసాగనున్నారు. 

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఎం శామ్యూల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పదవీ విరమణ అనంతరం ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైయస్ జగన్ కు రాజకీయ పరంగా సూచనలు సలహాలు ఇస్తుండేవారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు డబుల్ ధమాకా వరించింది.