‘మగాడిని చూస్తేనే వణికిపోతోంది’

Reacting on 9 year old girl rape incident, Roja demands TDP govt should vow responsibility
Highlights

ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమన్న రోజా

దాచేపల్లి అత్యాచార బాధితురాలిని ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. రెండు రోజుల క్రితం దాచేపల్లిలో 9ఏళ్ల చిన్నారిపై 53ఏళ్ల రామసుబ్బయ్య అనే ముదసరి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గురువారం ఉదయం ఎమ్మెల్యే రోజా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ ఘటనతో అర్థమౌతోందన్నారు. టీడీపీ నేతలు చేసే తప్పులు కాపాడటానికి మాత్రమే పోలీసులు ఉన్నారని విమర్శించారు.

కామాంధుడి కారణంగా బాలిక తీవ్ర భయాందోళలకు గురైనట్లు రోజా తెలిపారు. మగవాడు అంటేనే బాలిక వణికిపోతోందని, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె వివరించారు.

loader