విశాఖ రిషికొండ బీచ్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. యువతీ యువకులు డ్రగ్స్ తీసుకొని బీచ్ లో చిందులు వేశారు. ఆన్ లైన్ లో డ్రగ్స్ కనుగోలు చేసి మరీ పార్టీలో సేవించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గ్రాము రూ.4వేల చొప్పున ఈ డ్రగ్స్ ని కొనుగోలు చేయడం గమనార్హం.

పోలీసులకు పట్టుబడినవారిలో ఎక్కువగా కాలేజీ విద్యార్థులే ఉన్నారు. నిషిద్ధ మాదకద్రవ్యాలు ఎవరు, ఎవరికి, ఎలా సరఫరా చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతను టార్గెట్ చేస్తూ.. డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఈ రేవ్ పార్టీ ఇప్పుడు విశాఖ నగరంలో సంచలనం రేపింది. 

కొకైన్, హెరాయిన్ కన్నా ఎండీఎంఎ, ఎల్ ఎస్ డీ వంటివి ఎక్కువ మత్తు కలిగించేవని తెలుస్తోంది. అరుదైన వీటిని విశాఖలో వినియోగించడం సంచలనం కలిగిస్తోంది. నగరంలో మాదక ద్రవ్యాలను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్న కొందరు వ్యాపారులు రహస్య ప్రాంతాల్లో భద్రపరిచినట్టు పోలీసులకు సమాచారం అందింది.