అమరావతి: అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రేప్ కేసు ఉందనే విషయం ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయాన్ని గోరంట్ల మాధవ్ కూడ ప్రస్తావించారు. 2012 లో ఈ కేసు ఉందని అఫిడవిట్‌లో ప్రస్తావించారు..

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో హిందూపురం ఎంపీ స్తానం నుండి  గోరంట్ల మాధవ్  వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. అంతకు ముందు ఆయన పోలీసు అధికారిగా ఉన్నాడు. ఎన్నికలకు ఏడాది ముందు అప్పటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సంచలన విమర్శలు చేసి గోరంట్ల మాధవ్  వార్తల్లో నిలిచారు.

 

దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలపై రేప్ కేసుల గురించి  కూడ ఈ సందర్భంగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాల్లో  హిందూపురం ఎంపీ విషయం కూడ ప్రస్తావనకు వచ్చింది. 14/2012 కేసు నమోదైంది. 

తనపై ప్రైవేట్ కేసులు నమోదై ఉండొచ్చని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ సందర్భంగా  ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఓ చట్టాన్ని తీసుకురానుంది.ఈ విషయమై అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు.

ఈ చర్చ సందర్భంగా  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఈ కేసును గురించి ప్రస్తావించారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ నేతలు మహిళలపై చేసిన దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన విషయాలను  ప్రస్తావించాడు. ఇదే క్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  కేసు విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

చంద్రబాబునాయుడు ఈ కేసు గురించి ప్రస్తావించగానే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కొత్తగా తెచ్చు చట్టం గురించి ఏం చేయాలనే విషయమై సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. కానీ, పాత విషయాలు తోడితే తాము కూడ టీడీపీ నేతల చిట్టా విప్తుతామని చెప్పారు.