Asianet News TeluguAsianet News Telugu

బర్త్ డే పార్టీలో యువతిపై రేప్: వీడియోను వాట్సప్ గ్రూప్ ల్లో షేర్ చేసిన టెక్కీలు

కృష్ణా జిల్లా అగిరిపల్లి అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

rape, agiripalli, nri college, krishna

విజయవాడ: కృష్ణా జిల్లా అగిరిపల్లి అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బిటెక్ విద్యార్థిని పుట్టిన రోజు వేడుకకు పిలిచి, ఇద్దరు సీనియర్ విద్యార్థులు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

శివారెడ్డి, కృష్ణవంశీ అనే బిటెక్ విద్యార్థులు ఆమెపై అత్యాచారం చేసి వీడియో తీశారు. తాజాగా ఆ వీడియోను ఆసరా తీసుకుని యువతిని ప్రవీణ్ అనే యువకుడు బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. 

పెళ్లి కుదిరే సమయంలో ముగ్గురు కూడా అత్యాచారానికి సంబంధించిన వీడియో పలు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రవీణ్ అనే యువకుడు ఆమె నుంచి పది లక్షల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా తన కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేసినట్లు బయట పడింది.

కృష్ణ వంశీ, శివారెడ్డి 2017లో బిటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తుండగా, ప్రవీణ్ ఎంబిఎ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యువతి సూసైడ్ చేసుకోవాలనే తాము వాట్సప్ లో వీడియోను పోస్టు చేసినట్లు నిందితులు చెప్పినట్లు కూడా తెలిస్తోంది. ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

యువతి నుంచి 2017 మే నెలలో యువకులు బంగారు గొలుసు తీసుకున్నట్లుగా కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు కళాశాల యాజమాన్యానికి చెప్పారు. 

అత్యాచార ఘటన 2017 ఫిబ్రవరి ప్రాంతంలో జరిగింది. కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందిన బాధితురాలు ఆ సమయంలో ఎన్నారై ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అత్యాచారం జరిపిన వీడియోను నిందితులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తమ ముఖాలు కనిపించకుండా బ్లర్‌ చేసి.. ఆమె ముఖం ఒక్కటే కనిపించేలా చేసి వీడియోను తమ స్నేహితుల మొబైళ్లకు పంపించారు. 

ఆ వీడియోను చూసిన బొద్దనపల్లి గ్రామానికి చెందిన దొడ్ల ప్రవీణ్‌.. ఆమెకు ఫోన్‌ చేసి, బెదిరించాడు. రూ. పది లక్షలు ఇస్తే సరే, లేదంటే ఆ వీడియోను బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. చివరకు బాధితురాలి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
 
ఆ యువతి జోలికి వెళ్ళబోమని, లిఖితపూర్వక హామీ తీసుకుని, ఆ వీడియోను డిలిట్‌ చేయించింది. ఆ సమస్య అక్కడితో తీరిపోయిందని బాధితురాలి కుటుంబం అనుకుంది. బాధితురాలికి పెళ్లి కుదిరే సయమంలో కాలేజీ యాజమాన్యం ముందు డిలిట్‌ చేసినట్టు కనిపించిన వీడియో దృశ్యాలు పది రోజులక్రితం తిరిగి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios