గుంటూరు: డ్రగ్స్ మత్తులో తూగుతున్న పాఠశాల విద్యార్ధులు, ఉలిక్కిపడ్డ విద్యాశాఖ
గుంటూరు జిల్లా తాడేపల్లిలో విద్యార్ధులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. టీచర్లు, తల్లీదండ్రుల కమిటీలతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఇది చాలా బాధకరమైన విషయమన్నారు. విద్యాశాఖ కమీషనర్ చిన వీరభద్రుడి ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఇక విద్యార్ధులు మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు అధికారులు.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరిపి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులతో సంప్రదించి విద్యాసంస్థలో మాదక ద్రవ్యాలు ఎలా అరికట్టాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
అలాగే మిగిలిన పాఠశాలలపైనా పర్యవేక్షణ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెబుతున్నారు. విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెంచుకుని వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
విద్యార్ధులు సన్మార్గంలో వెళ్లే విధంగా విద్యాశాఖ కృషి చేస్తుందని, పిల్లలపై తల్లీదండ్రులు కూడా నిఘా పెట్టాలని సూచించారు అధికారులు. కాగా, తాడేపల్లిలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులు మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడటం సంచలనం సృష్టించింది.