Asianet News TeluguAsianet News Telugu

మంత్రి అవంతి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: పీఆర్‌.మోహన్‌

71వ గణతంత్ర దినోత్సవం సంధర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండా తిరగబడి ఉన్నా...జెండాకు సెల్యూట్‌ చేయటంపై ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

pr mohan comments on avanthi srinivasarao
Author
Amaravathi, First Published Jan 27, 2020, 11:10 AM IST

71వ గణతంత్ర దినోత్సవం సంధర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండా తిరగబడి ఉన్నా...జెండాకు సెల్యూట్‌ చేయటంపై ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాఫ్‌ మాజీ చైర్మన్‌ పీఆర్‌.మోహన్‌ సైతం ఈ విషయంపై స్పందిస్తూ వెంటనే అవంతి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేఖ విడుదల చేశారు.

"71వ గణతంత్ర దినోత్సవం సంధర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు జాతీయ జెండా తిరగబడి ఉన్నా...జెండాకు సెల్యూట్‌ చేయటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. తర్వాత అక్కడున్నవారు జెండా తిరగబడి ఉండటాన్ని గమనించి కిందకు దించి మళ్లీ కట్టడానికి ఇదేమైనా డ్రెస్‌ రిహార్సలా? జాతీయ జెండాను కిందకు తిప్పికట్టిన వారిని, సెల్యూట్‌ చేసిన మంత్రి అవంతిని దేశ ప్రజలు క్షమించరు. అవంతి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి" అని లేఖలో పేర్కొన్నారు.

---

also read: ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ... చంద్రబాబు అభిప్రాయమేమిటో..?: మంత్రి అవంతి

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఆదివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖను పరిపాలన  రాజధానిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చాలా గొప్పదని ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంత్రి ఆధ్వర్యంలోనే  విశాఖ తగరపు వలస లో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తగరపు వలస ప్రధాన కూడలిలో మంత్రి అవంతి మాట్లాడుతూ... విశాఖను రాజధానిగా కొనసాగడానికి చంద్రబాబు అనుకులమో, వ్యతిరేకమో చెప్పాలన్నారు. ఆయనకు చిత్తశుద్ధి  వుంటే విశాఖలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 

read more  చిన్నారులకు స్వయంగా పోలీయో చుక్కలు వేసిన మంత్రి అవంతి

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతిలో రైతుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జరిగే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న కాలంలో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి చేస్తారన్న నమ్మకం సీఎంపై వుందని మంత్రి తెలిపారు. 

ఈ భారీ ర్యాలీలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని నిర్మల, వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డితో పాటు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios