Asianet News TeluguAsianet News Telugu

పొంగూరు నారాయణ: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Ponguru Narayana Biography: ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న పట్టుదలతో ఓ ఓ చిన్న అద్దె గదిలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. తమ విద్యార్థులు అత్యున్నత విజయాలు సాధించడంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత పాఠశాలలు, కాలేజీలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ప్రారంభించారు. ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించారు. ఎదురైన కష్టాల్ని,ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కున్నారు. ఆ ఫలితమే దేశవ్యాప్తం విజయవంతంగా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ. ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీకోసం.. 

Ponguru Narayana Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 23, 2024, 3:15 AM IST

Ponguru Narayana Biography: ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న పట్టుదలతో ఓ ఓ చిన్న అద్దె గదిలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. తమ విద్యార్థులు అత్యున్నత విజయాలు సాధించడంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత పాఠశాలలు, కాలేజీలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ప్రారంభించారు. ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించారు. ఎదురైన కష్టాల్ని,ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కున్నారు. ఆ ఫలితమే దేశవ్యాప్తం విజయవంతంగా నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ. ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీకోసం.. 

బాల్యం, విద్యాభ్యాసం

పొంగూరు నారాయణ  1956 జూన్ 15న నెల్లూరు లోని హరనాథపురంలో సుబ్బరామయ్య పుంగునూరు దంపతులకు జన్మించారు. నారాయణ తండ్రి ఓ ప్రైవేట్ బస్సు కండక్టర్ దీంతో ఆయన బాల్యం చాలా పేదరికంలో గడిచింది. అయితే విద్యలో ఎన్నడూ వెనకబడలేదు. ఆయన చదివిన ప్రతి క్లాసులో ఆయనే ఉత్తమ విద్యార్థిగా ఉపాధ్యాయుల మన్నలు పొందారు. కాలేజీలో చదివేటప్పుడు ట్యూషన్లు చెప్పేవారు. చిన్నపిల్లలే కాదు తన తోటి విద్యార్థులు కూడా నారాయణ గారు ట్యూషన్లు చెప్పేవారు. ఆయన 1977లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకం సాధించారు. ఎంఎస్‌సి అనంతరం పిహెచ్‌డి చేశారు. ఆ తరువాత నారాయణ గారు నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశారు. అప్పుడు ఆయన గంట పాటు పాఠం చెప్తే ఆరు రూపాయలు జీతం గా ఇచ్చేవారట. 

నారాయణ విద్యాసంస్థలు 

తాను ఉన్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలని పట్టుదలతో ముందుకు సాగారు నారాయణ. కొత్తగా ఏదైనా చేయాలని అనుకునే ఆయన తన ప్రస్థానంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నారాయణ తన కోచింగ్ సెంటర్ లో అతి కష్టమైన, క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యేలా చెప్పేందుకు కృషి చేశారు.గణితాన్ని చాలా సులభమైన పద్దతిలో చెబుతున్నారన్న విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాష్ట్రమంతా తెలిసిపోయింది. దీంతో మాథ్స్ నేర్పించాలని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుండి కూడా పిల్లలను తల్లిదండ్రులు తీసుకవచ్చేవారు. ఈ క్రమంలో గణితంతో పాటూ ఇతర సబ్జెక్ట్స్ భోదించే ఉపాధ్యాయుల్ని తనతో చేర్చుకున్నారు.

అలా ఓ చిన్న ట్యూషన్ సెంటర్ గా ప్రారంభమైన ఆ ప్రస్థానం అనతి కాలంలోనే ఓ సక్సెస్ పుల్ కోచింగ్ సెంటర్ గా మారింది. డాక్టర్ నారాయణ తన ప్రణాళికతో అక్కడి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేవారు. ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారయణకు పోటీ కూడా లేకుండా పోయింది. ఎంసెట్ తో పాటు ఐ.ఐ.టి పోటీ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగరవేసేవారు.1979లో నెల్లూరులో ఓ చిన్న అద్దెగదిలో మొదలైన నారాయణ సంస్థ ఇప్పుడు దేశమంతటా విస్తరించింది. ఓ ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థగా ఆవిర్భవించింది. దాదాపు 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు, 40 వేల మంది సిబ్బందితో విద్యాప్రస్థానం సాగిస్తున్నది. నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐ.ఐ.టి-జే.ఇ.ఇ, నీట్, బిట్ శాట్, ఏ.ఎఫ్.ఎం.సి, ఎయిమ్స్, జిప్ మర్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు.

విద్యాసంస్థల ఏర్పాటు 

ఈ క్రమంలో విద్యారంగంలో మరింత ముందుకు సాగాలని 1990లో ఉన్నత పాఠశాలను  1993లో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు. ఆ తరువాత 1999లో జూనియర్ కాలేజీని స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో ఐఐటి కోచింగ్ సెంటర్లను కూడా ప్రారంభించారు. 1990లో చివర్లో నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగు పెట్టింది.

ఇక 1998లో నెల్లూరులో, 2001లో గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభించారు. అదే సమయంలో వైద్య విద్యపై కూడా ఫోకస్ పెట్టారు. 1999లో వైద్య కళాశాలను 2001లో దంత వైద్య కళాశాలను,  2002లో మెడికల్ కాలేజీల పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి, కర్నూల్, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో ప్రారంభించారు. ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో లో పిఎమ్‌టి, ఐఐటి-జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యాసంస్థల నేతృత్వం మరింత బలోపేతమయింది.

ఈ సంస్థ 2004-05లో కరెస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిలభారత టెస్ట్ సీరీస్‌ ఆన్‌లైన్ వెర్షన్‌ను ప్రారంభించింది. నారాయణ విద్యాసంస్థలన్నింటికీ వెన్నెముకగా నిలిచినవారు డాక్టర్ పి.నారాయణ. ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలు దేశంలోని 21 రాష్ట్రాల్లో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు, 60 వేల మందికి పైగా సిబ్బందితో విద్యాప్రస్థానం సాగిస్తున్నది. విద్యాసంస్థలలో నేడు నారాయణ అగ్రగామిగా నిలిచింది. 

రాజకీయ ప్రవేశం
 
విద్యారంగంలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ పి నారాయణ గారు రాజకీయ రంగంలో కూడా అడుగు పెట్టారు. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ముఖ్యంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తి, ఆయన పరిచయంతో నారాయణ రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలుత టీడీపీ సర్వే విభాగానికి
పనిచేసిన ఆయన క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004-2014 వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ పార్టీకి వెన్నంటి ఆయన.. చంద్రబాబు అధికారంలోకి రావడానికి తన వంతు క్రుషి చేశారు. అయితే కష్ట కాలంలో పార్టీకి తోడుగా నిలిచిన నారాయణను  చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారు. 

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు..  నారాయణను మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానాన్ని కల్పించారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు భాగస్వామ్యం కల్పించారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖలతోపాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కూడా నారాయణ గారు కీలక పాత్ర పోషించారు. 

వివాదాలు

2021-2022 విద్యా సంవత్సరంలో 10వ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ జరిగిందని నారాయణ విద్యాసంస్థలపై మాల్ ప్రాక్టీస్ కింద పలు కేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో నారాయణను ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి విచారించారు. అయితే 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసినట్లు ఆధారాలు ఉండడంతో వ్యక్తిగత పూచికత్తుతో ఆయనను అదేరోజు బెయిల్ పై విడుదల చేశారు.   

Follow Us:
Download App:
  • android
  • ios