ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రను పోలీసులు భీమవరంలో అడ్డుకున్నారు. లాక్‌డౌన్ జరిగే సమయంలోసైకిల్ యాత్ర చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా కలెక్టర్, ఎస్పీకి తాను ఫోన్ చేసినప్పటికీ వారు లిఫ్ట్ చేయటం లేదని అందుకే సైకిల్ యాత్రగా ఏలూరు బయలుదేరానని రామానాయుడు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రామానాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read అక్వా రైతుల కోసం పాలకొల్లు నుండి ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర...

కాగా...సోమవారం ఉదయం నుంచి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాలకొల్లు నుంచి ఏలూరుకు సైకిల్‌పై వెళ్లారు.. దాదాపు 106 కిలోమీటర్లు ఈ ప్రయాణం కొనసాతుంది. 

రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఇలా సైకిల్ యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. ఆక్వా , వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. రైతు సమస్యల్ని ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి ఈ యాత్ర చేపట్టానని ఆయన చెప్పారు.

కాగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన యాత్రకు బ్రేక్ పడింది. రామానాయుడు గతంలో కూడా వివిధ సమస్యలపై సైకిల్ యాత్ర చేశారు. అంతేకాదు లాక్‌డౌన్, కరోనా వేళ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాలకొల్లులో సైకిల్‌పై తిరిగారు. జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కోరారు.. అలాగే నిత్యావసరాలు, కూరగాయల ధరలపై ఆరా తీశారు. అంతేకాదు మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో శానిటేషన్‌లో పాల్గొన్నారు.